Viral Video: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. జాతిరత్నం అంటోన్న నెటిజన్లు!

స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతీ క్లాసులోనూ ఓ ఆణిముత్యం ఉంటాడు. టీచర్ టెస్ట్ పెట్టేవరకు లెస్సన్ చదవకపోవడం..

Viral Video: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. జాతిరత్నం అంటోన్న నెటిజన్లు!
Home Work
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 21, 2022 | 8:23 PM

స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతీ క్లాసులోనూ ఓ ఆణిముత్యం ఉంటాడు. టీచర్ టెస్ట్ పెట్టేవరకు లెస్సన్ చదవకపోవడం.. స్లిప్స్‌తో గట్టెక్కడం.. ఎగ్జామ్‌లో తెలియని ప్రశ్నలు వస్తే.. ఆన్సర్ షీట్ ఖాళీగా ఉంచకుండా.. తమ క్రియేటివిటీని చూపించడం.. అలాగే హోంవర్క్ లేదా రికార్డ్స్ కంప్లీట్ కాకపోతే.. బస్సులోనూ.. లేదా బండి వెనుక రాసేయడం.. ఇవన్నీ కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేసే కొన్ని చిత్రమైన పనులు.. సరిగ్గా ఇలాంటి కోవకు చెందిన ఓ జాతిరత్నం వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన పిల్లలను స్కూటీపై స్కూల్‌కు తీసుకెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. అయితే కొంచెం తీక్షణంగా చూస్తే.. ఆమె వెనుక కూర్చున్న బాబు.. అదే మన జాతిరత్నం.. ఎంతో శ్రద్దగా తన హోంవర్క్‌ను కంప్లీట్ చేస్తున్నాడు. బహుశా క్లాసులో మనోడి రోల్ నెంబర్ 1 అనుకుంట.. మళ్లీ టీచర్ ఎక్కడ తిడుతుందోనని.. ఇలా యమా స్పీడ్‌గా స్కూల్ వచ్చేలోపు తన హోంవర్క్ పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ దానిపై ఓ లుక్కేయండి. ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.