Viral Video: చేపల కోసం వేసిన గాలం బరువెక్కింది.. చిక్కింది చూడగా కళ్లు జిగేల్!

సీ ఫుడ్ అంటే ఇష్టపడే చాలామంది తరచూ చేపల వేటకు వెళ్తుంటారు. మన దేశంలో అయితే ఇలాంటి సందర్భాలు తక్కువే..

Viral Video: చేపల కోసం వేసిన గాలం బరువెక్కింది.. చిక్కింది చూడగా కళ్లు జిగేల్!
Fish
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 22, 2022 | 8:27 PM

సీ ఫుడ్ అంటే ఇష్టపడే చాలామంది తరచూ చేపల వేటకు వెళ్తుంటారు. మన దేశంలో అయితే ఇలాంటి సందర్భాలు తక్కువే.. కాని అమెరికాలో అయితే ఇవన్నీ కామన్. వీకెండ్ వస్తే చాలు.. ఫ్యామిలీతో కలిసి దగ్గరలోని సరస్సు దగ్గర చిన్న క్యాంప్ ఫైర్ వేసుకుని చేపల వేటకు వెళ్తారు. మరికొందరైతే.. బోట్ వేసుకుని సరస్సు మధ్యకు వెళ్లి చేపలు పడతారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓ వ్యక్తి స్థానికంగా ఉండే సరస్సు దగ్గరకు వెళ్లి చేపలు పట్టగా.. అతడి గాలానికి చిక్కింది చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన ఇంటికి దగ్గరలోని సరస్సులో చేపల వేటకు వెళ్లాడు. ఓ పెద్ద చేప గాలానికి చిక్కితే.. అద్భుతంగా వంట చేసుకుని లాగించొచ్చు అనుకున్నాడు. అదే ఊహలతో గాలానికి ఎరను కట్టి.. సరస్సులోకి వదిలాడు. కొద్దిసేపటికి గాలం బరువెక్కింది. పెద్ద చేప చిక్కినట్లు అనిపించి.. గాలాన్ని బయటికి గట్టిగా లాగేందుకు ప్రయత్నించాడు. ఇక ఆ గాలానికి చిక్కిన చేప.. వదిలించుకోవడానికి ట్రై చేస్తుండగా.. మనోడు కూడా దాని పట్టు వదల్లేదు. అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి గాలానికి ఓ పెద్ద ఈల్ చేప చిక్కింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.