Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోట్లు ఖర్చు చేసినా ఇంతటి మానసిక ఆనందం దొరకదు భయ్యా.. మాటల్లో వర్ణించలేని సన్నివేశం..!

Viral Video: సంతోషం సగం బలం అంటారు. అందుకే.. అన్ని చింతలను వదిలి సంతోషంగా జీవించండని పెద్దలు సూచిస్తుంటారు.

Viral Video: కోట్లు ఖర్చు చేసినా ఇంతటి మానసిక ఆనందం దొరకదు భయ్యా.. మాటల్లో వర్ణించలేని సన్నివేశం..!
Auto Driver
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 23, 2022 | 6:40 AM

Viral Video: సంతోషం సగం బలం అంటారు. అందుకే.. అన్ని చింతలను వదిలి సంతోషంగా జీవించండని పెద్దలు సూచిస్తుంటారు. ఎందుకంటే.. సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటాం. తాజాగా ఓ ఆటోవాలా ఆనందంతో పరవశించిపోతూ.. నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రమ్‌ యాక్టీవ్‌గా ఉంటూ.. ఫన్నీ వీడియోలను షేర్ చేసే హాస్య నటుడు సునీల్ గ్రోవర్ ఈ వీడియోను షేర్ చేశాడు.

గుజరాత్‌లోని భరూచ్‌కి చెందిన ఆటో డ్రైవర్ భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయిన రహదారి మధ్యలో సంతోషంగా నృత్యం వేశాడు. చుట్టూ ఎవరు ఉన్నారు? తానెక్కడున్నాను? అనే సంశయమే లేకుండా.. వర్షాన్ని, వరద నీటిని తెగ ఎంజాయ్ చేశాడు. చిన్నపిల్లాడిలా మారిపోయి.. సరదాగా డ్యాన్స్ చేశాడు. వాస్తవానికి ఆ డ్యాన్స్‌కు ముందు.. అతని ఆటో గుంతలో కూరుకుపోయింది. దాంతో ఆటోను బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడం.. ఆటోను రోడ్డుపైనే వదిలేశాడు. వర్షపు నీటిలో డ్యాన్స్ చేశాడు. కాగా, ఈ డ్యాన్స్‌కు బ్యాక్ డ్రాప్‌గా తేరీ పాయల్ బాజీ జహాన్ పాట వస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాండ్స్ వస్తోంది. 1 మిలియన్ వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఆటో డ్రైవర్ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కోట్లు పెట్టిన ఇలాంటి సంతోషం లభించదని మరికొందరు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..