Pregnancy Issue: శృంగారం తర్వాత మహిళలు టాయిలెట్‌కు వెళ్లాలా? వద్దా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Pragnancy Issues: వివాహం తరువాత చాలా మంది దంపతులు పిల్లలకు కోసం ప్రయత్నిస్తుంటారు. కొందరికి అనారోగ్య సమస్యల కారణంగా..
Pragnancy Issues: వివాహం తరువాత చాలా మంది దంపతులు పిల్లలకు కోసం ప్రయత్నిస్తుంటారు. కొందరికి అనారోగ్య సమస్యల కారణంగా పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఆందోళనకు గురవుతుంటారు. అయితే, చాలా మందికి సెక్స్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. సంభోగం సమయంలో రకరకాల గందరగోళాలు ఉంటాయి. కొంతమంది సెక్స్ తరువాత మహిళలు మూత్ర విసర్జన చేయొద్దని, చేసినా ఏం కాదని మరికొందరు చెబుతూ కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. దీని వల్ల శుక్రకణాలు బయటకు వెళ్లిపోయి, ప్రెగ్నెన్సీ రావదని చెబుతుంటారు. మరి ఇంతకీ వాస్తవం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లల కోసం ట్రై చేస్తున్నారా? మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? కానీ, సమాజంలో ఒక్కొ్క్కరూ ఒక్కేలా చెప్పే అంశాలతో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే, మీకోసమే నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. సెక్స్ చేసిన తరువాత 5 నుంచి 10 నిమిషాల వరకు లేవకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శుక్రకణాలు గర్భాశయంలోకి ప్రవేశిస్తాయి. అందుకే శారీకంగా కలిసిన తరువాత వెంటనే మూత్ర విసర్జన చేయకూడదు.
శారీరకంగా కలిసిన తరువాత మూత్రవిసర్జన చేయడం మంచిదేనా? భౌతికంగా ఒక్కటైన వెంటనే మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే, అలా మూత్ర విసర్జన చేయడం వల్ల చాలా మేలు కూడా జరుగుతుందంటున్నారు. సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా మొత్తం తొలగిపోతుందట. అలాగే, UTIని అభివృద్ధి చేసే ప్రమాదం ఉన్నట్లయితే.. మూత్ర విసర్జన చేయడం ఉత్తమమేనని సూచిస్తున్నారు వైద్యులు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుందని, ఈ కారణంగా , సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయడం మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు.
సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయకపోతే..? సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయకపోతే కొంతకాలం తరువాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఈ కారణంగా పిల్లల కోసం ప్రయత్ని్స్తున్న వారిని మినహాయించి, భౌతికంగా కలిసిన తరువాత మూత్ర విసర్జన చేయడం అవసరం అని సూచిస్తున్నారు వైద్యులు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..