Digestion Tips: మీ జీర్ణక్రియ మెరుగుపడాలంటే వీటిని పాటిస్తే సరి..!

సాధారణంగా జీర్ణ సమస్యలంటే కడుపు నొప్పి, గ్యాస్, గుండెల్లో మంట, వికారం, మలబద్ధకం, విరేచనాలు వంటివి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చవిచూసి ఉంటారు. ఐతే, ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే మాత్రం..

Digestion Tips: మీ జీర్ణక్రియ మెరుగుపడాలంటే వీటిని పాటిస్తే సరి..!
Digestion
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 20, 2022 | 1:13 PM

digestion tips in telugu: సాధారణంగా జీర్ణ సమస్యలంటే కడుపు నొప్పి, గ్యాస్, గుండెల్లో మంట, వికారం, మలబద్ధకం, విరేచనాలు వంటివి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చవిచూసి ఉంటారు. ఐతే, ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే మాత్రం అలక్ష్యం చేయకూడదు. నిజానికి ఈ సమస్యలు ఆహారం, జీవనశైలి మార్పుల కారణంగా తలెత్తుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఈ కింది మార్గాలను పాటిస్తే సరి..

టైంకి భోజనం చేస్తే అసలే సమస్య ఉండదు. ప్రతిరోజూ ఒకే సమయంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తినేలా ఖచ్చితమైన పద్ధతిని పాటించాలి. దీనితోపాటు అధికంగా నీరు త్రాగటం అలవాటు చేసుకోవాలి. జీర్ణక్రియ సక్రమంగా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ఆవసరం. పొగ తాగడం, పరిమితికి మించి కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. మద్యం, సిగరెట్లు , కాఫీ లేదా ఇతర కెఫిన్ కలిగిన పానియాలు జీర్ణవ్యవస్థ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే టైం లేదనో, ఆహారం రుచిగా లేదనో హడావిడిగా కానీయకుండా ఆహారం పూర్తిగా నమిలి తినాలి. ఒత్తిడి శరీర ఆరోగ్యం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. సమయం కుదిరినప్పుడల్లా మీరు ఏ విషయాలవల్లనైతే ఎక్కువ స్ట్రెస్‌ ఫీల్ అవుతున్నారో.. వాటిని ఏ విధంగా అధిగమించవచ్చో ఆలోచించాలి. ఐతే నివారించలేని కొన్ని సమస్యల కోసం అతిగా ఆలోచించకుండా మెదడులో నుంచి పూర్తిగా తీసివెయ్యాలి.

ఇవి కూడా చదవండి

ఫైబర్ శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మీ సొంతం అవుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఫైబర్‌ సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా ఫైబర్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధమైన అలవాట్లను పాటిస్తే క్రమంగా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఐతే ఇవన్నీ పాటించినప్పటికీ మార్పులేకపోతే డాక్టర్‌ను సంప్రదించవల్సి ఉంటుంది.