Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దయచేసి ఇలా చేయకండి.. కళ్లముందే బైక్‌ రైడర్‌ గల్లంతు.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..

చాలా మంది అధికారుల హెచ్చరికలను పట్టించుకోరు. కొందరు సాహాసం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో అందుకు ఉదాహరణగా నిలుస్తుంది.

Viral Video: దయచేసి ఇలా చేయకండి.. కళ్లముందే బైక్‌ రైడర్‌ గల్లంతు.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..
Bike Rider Swept Away
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 19, 2022 | 7:43 PM

Viral Video: భారీ వర్షాల సమయంలో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. పొంగిపొర్లుతున్న నదులు, వాగులపై వంతెనలు కల్వర్టులను దాటడానికి ప్రయత్నించవద్దని స్థానిక పరిపాలన అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ, చాలా మంది అధికారుల హెచ్చరికలను పట్టించుకోరు. కొందరు సాహాసం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఒక బైక్ రైడర్ వంతెనపై ప్రవహిస్తున్న నది నీటి ప్రవహాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ నీటి ఉధృతి వేగంగా ఉండటంతో యువకుడు బైక్‌తో పాటు నదిలో మునిగిపోయాడు. వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకు కూడా గూస్‌బంప్స్ రావటం ఖాయం..

వైరల్ అవుతున్న వీడియోలో బైక్ రైడర్ వంతెనపై ప్రవహిస్తున్న నీటిని దాటుకుని అవతలి ఒడ్డుకు చేరాలని ప్రయత్నించాడు.. కానీ మృత్యువు తనను ఇక్కడికి లాగుతుందనే ఆలోచన అతనికి లేదు. అందుకే బ్రిడ్జి మీద నీటి ప్రవాహంలో కూడా బైక్ స్టార్ట్ చేసి ముందుకు సాగిపోయాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాతే యువకుడు బైక్‌ అదుపు తప్పి బైక్‌తో పాటు నదిలో మునిగిపోయాడు. ఈ దృశ్యం నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే నదిలో పడిపోయిన తరువాత యువకుడి జాడ కనిపించలేదు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. కానీ, ఈ షాకింగ్‌ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లు దాటకండి .. ఇది చాలా ప్రమాదకరం.. మీరు మునిగిపోయే అవకాశం ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోను జ్యోతి సింగ్ అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో దయచేసి రోడ్డు దాటవద్దు’ అని జ్యోతి క్యాప్షన్‌లో రాసింది. ఈ వీడియో మధ్యప్రదేశ్‌కు చెందినదిగా కొందరు భావిస్తున్నారు. కానీ, వీడియో మాత్రం సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా షేర్ చేయబడుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇలా తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్  చేయండి