Delhi: మెట్రో లైన్‌ సమీపంలోని మూడంతస్తుల భవనంలో మంటలు.. రంగంలోకి 5 ఫైరింజన్లు..

న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో భయంకరమైన మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళానికి చెందిన 5 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొన్ని గంటల తర్వాత

Delhi: మెట్రో లైన్‌ సమీపంలోని మూడంతస్తుల భవనంలో మంటలు.. రంగంలోకి 5 ఫైరింజన్లు..
representative image
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 19, 2022 | 6:58 PM

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్‌ ఓ భవనంలో అకస్మత్తుగా మంటలు చెలరేగాయి . సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో భవనంలో చిక్కుకున్న వారిలో 12 మందిని ఫైర్‌ సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. మూడు అంతస్తులు గల భవనం మొదటి అంతస్తులో మండలు చెలరేగాయి. దట్టమైన పొగలతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతమంతా భయంకరంగా మారింది. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. మంటల్లో చాలా మంది ప్రజలు చిక్కుకుపోవడంతో చుట్టుపక్కల గందరగోళం నెలకొంది. భవనం నుంచి వెలువడే పొగ చాలా దూరం కనిపించింది.

న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో భయంకరమైన మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళానికి చెందిన 5 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొన్ని గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్‌ సిబ్బంది.. అదే సమయంలో భవనంలో చిక్కుకున్న 12 మందిని ఇప్పటివరకు రక్షించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ కలుగలేదని అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ సమాచారం మేరకు దాదాపు గంట వ్యవధిలో మంటలు అదుపులోకి వచ్చాయి. కాగా, మంటలు చెలరేగిన భవనం మెట్రో లైన్ సమీపంలో ఉండటం ఆందోళన కలిగించింది.

ఇవి కూడా చదవండి

అంతకుముందు కూడా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు 6 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. అ అయితే కొద్దిరోజుల క్రితం జన్‌పథ్‌లోని ఓ పిజ్జా షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అగ్నిప్రమాదం కారణంగా లక్షల రూపాయల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి