CM Eknath Shinde: షిండే అంకుల్‌.. మీలా చేస్తే నేనూ సీఎం కాగలనా..? మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఝలక్ ఇచ్చిన చిన్నారి..

వీడియో చూసిన నెటిజన్లు సైతం చిన్నారి వేసిన ప్రశ్నకు ఆశ్చర్యపోతున్నారు. ఆ చిన్నారి ఏకంగా సీఎంనే పట్టుకుని తాను కూడా మీలా ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలో చెప్పమని అడిగింది..మీలాగా సీఎం కావడం ఎలా?

CM Eknath Shinde: షిండే అంకుల్‌.. మీలా చేస్తే నేనూ సీఎం కాగలనా..? మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఝలక్ ఇచ్చిన చిన్నారి..
Maha Cm
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 19, 2022 | 3:45 PM

సోషల్ మీడియాలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే,ఒక చిన్నారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం చిన్నారి వేసిన ప్రశ్నకు ఆశ్చర్యపోతున్నారు. ఆ చిన్నారి ఏకంగా సీఎంనే పట్టుకుని తాను కూడా మీలా ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలో చెప్పమని అడిగింది..మీలాగా సీఎం కావడం ఎలా? అస్సాంలో వరదలు వచ్చినప్పుడు, మీరు ప్రజలకు సహాయం చేయడానికి నీటిలో నడిచారు. మీలాగా వరద బాధిత ప్రజలను ఆదుకోవడం ద్వారా నేను ముఖ్యమంత్రిని కాగలనా? అంటూ అమాయకంగా ప్రశ్నించింది ఆ చిన్నారి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ అవుతున్న వీడియోలో ఇలా ఉంది..షిండే అంకుల్‌.. ముఖ్యమంత్రి కావడం ఎలా అంటూ ఓ చిన్నారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగిన ప్రశ్న ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది. ముంబైలోని నందనవన్ బంగ్లాలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసింది అన్నడా దామ్రే అనే ఓ చిన్నారి. ‘మీలాగా సీఎం కావడం ఎలా? అంటూ ప్రశ్నించింది. అస్సాంలో వరదలు వచ్చినప్పుడు, మీరు ప్రజలకు సహాయం చేయడానికి నీటిలో నడిచారు. మీలాగా వరద బాధిత ప్రజలను ఆదుకోవడం ద్వారా నేను ముఖ్యమంత్రిని కాగలనా? అంటూ అమాయకంగా ప్రశ్నించింది ఆ చిన్నారి. అంతేకాదు.. దీపావళి సెలవుల్లో తననూ గౌహతికి తీసుకెళ్లాలని సీఎం షిండేను అభ్యర్థించింది. దానికి సీఎం షిండే నవ్వుతూ.. నువ్వు ముఖ్యమంత్రి కచ్చితంగా అవుతావ్‌. అందుకోసం ఒక తీర్మానం కూడా పాస్‌ చేస్తాం అంటూ చెప్పారాయన. దీపావళికి గువాహతికి తీసుకెళ్తానని, అక్కడున్న కామాఖ్య గుడికి వెళ్దామా? అని అడిగారాయన. దానికి అలాగే అనే సమాధానం ఇచ్చింది. ఈ చిన్నారి చాలా తెలివైనది అన్న సీఎం మాటలకు అక్కడున్నవాళ్లంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇక అంతే ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో చేరి తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

గత నెలలో ఏక్నాథ్ షిండే శాసనసభలో 39 మంది శివసేన సభ్యులతో తిరుగుబాటు చేశారు. చివరకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను నిలదీయవలసి వచ్చింది. జూన్ 30న భారతదేశ కొత్త ప్రధానులుగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ మరియు భారతీయ జనతా పార్టీకి చెందిన షిండే ప్రమాణ స్వీకారం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి