TRAI: ఐడియా, బీఎస్ఎన్ఎల్‌కు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో జియోకు మరింత పెరిగిన సబ్‌స్క్రైబర్ల సంఖ్య..

జాతీయంగా.. రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను సొంతం చేసుకుంది. దీంతో రిలయన్స్ జీయో భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది.

TRAI: ఐడియా, బీఎస్ఎన్ఎల్‌కు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో జియోకు మరింత పెరిగిన సబ్‌స్క్రైబర్ల సంఖ్య..
Jio
Follow us

|

Updated on: Jul 19, 2022 | 6:16 PM

TRAI Data: టెలికాం రంగంలో జియో దూసుకుపోతోంది. అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లతో ఉన్న జియో మరో రికార్డును కైవసం చేసుకుంది. టెలికాం రెగ్యులేటరీ సంస్థ TRAI విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం.. మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలయన్స్ జియో అత్యధికంగా 3,27,020 మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను సొంతం చేసుకున్నట్లు ట్రాయ్ వెల్లడించింది. ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్ 71,312 మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది. ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL 78,423 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయినట్లు ట్రాయ్ పేర్కొంది.

జాతీయంగా, రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను సొంతం చేసుకుంది. దీంతో రిలయన్స్ జీయో భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 40.87 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను సొంతం చేసుకుంది. దీంతో ఎయిర్‌టెల్ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. మరో వైపు, వోడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గి 25.84 కోట్లకు పడిపోయింది. BSNL వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణఆంధ్రప్రదేశ్ వార్తలు..

మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!