Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. మరోసారి తేల్చిచెప్పిన కేంద్రం ప్రభుత్వం..

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య ఎటువంటి తేడాను పద్నాలుగో ఫైనాన్స్‌ కమిషన్‌ చూపలేదని మరోసారి స్పష్టం చేసింది.

AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. మరోసారి తేల్చిచెప్పిన కేంద్రం ప్రభుత్వం..
Ap Special Status
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 19, 2022 | 4:25 PM

AP Special Status News: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత రాగమే వినిపించింది. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య ఎటువంటి తేడాను పద్నాలుగో ఫైనాన్స్‌ కమిషన్‌ చూపలేదని మరోసారి స్పష్టం చేసింది. పదిహేనో ఫైనాన్స్‌ కమిషన్‌ కూడా అదే తీరును కొనసాగిస్తోందని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అడిగిన ప్రశ్నకు కేంద్రం.. పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. రెవెన్యూ లోటును కూడా అందజేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశామని కేంద్రం తెలిపింది. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు.

14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదని పేర్కొంది. పన్నుల్లో వాటాను 32% నుంచి 42 శాతానికి పెంచినట్లు తెలిపింది. 15వ ఆర్థిక సంఘం కూడా అదే తరహాలో సిఫార్సులు చేసిందని.. ఆ తర్వాత 41 శాతానికి సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. పన్నుల్లో వాటా, లోటు నిధుల సర్దుబాటు ద్వారా రెవెన్యూ లోటును సర్దుబాటు చేస్తున్నామని కేంద్ర పేర్కొంది. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశామని.. సంస్థల ఏర్పాటు అనేది సుదీర్ఘమైన ప్రక్రియ అని కేంద్రం లేఖలో పేర్కొంది.

విభజన చట్టం అమలుపై ఇప్పటికే 28 సార్లు సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర సహాయమంత్రి నిత్యానంద్ రాయ్.. ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణఆంధ్రప్రదేశ్ వార్తలు..

సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా..?
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా..?
కూతుర్ని ఇంటి నుంచి గెంటేసి.. గుణపాఠం నేర్పిన తండ్రి!
కూతుర్ని ఇంటి నుంచి గెంటేసి.. గుణపాఠం నేర్పిన తండ్రి!
Video: ఫ్యాన్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది
Video: ఫ్యాన్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది
ఆ ఆలయం, రథ వీధిలో వివాహానికి ముందు తరువాత ఫోటోషూట్‌పై నిషేధం..
ఆ ఆలయం, రథ వీధిలో వివాహానికి ముందు తరువాత ఫోటోషూట్‌పై నిషేధం..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మూల్యాంకనం ముగిసిందోచ్‌! ఫలితాల తేదీ
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మూల్యాంకనం ముగిసిందోచ్‌! ఫలితాల తేదీ
ఇకపై CSK కెప్టెన్‌గా ధోని! మార్పు ఎందుకంటే..?
ఇకపై CSK కెప్టెన్‌గా ధోని! మార్పు ఎందుకంటే..?
ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త
ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త
జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. చేబ్రోలు కిరణ్ అరెస్ట్..
జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. చేబ్రోలు కిరణ్ అరెస్ట్..
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అంటున్నరేణు ప్రశంసల వర్షం
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అంటున్నరేణు ప్రశంసల వర్షం