Viral Video: వంతెన దాటుతూ వరద నీటిలో కొట్టుకుపోయిన స్కూల్‌ బస్సు.. వైరల్‌ అవుతున్న వీడియో

స్కూల్ బస్సు వరద నీటిలోకి వచ్చింది . రోడ్డుకు ఇరువైపులా ప్రహరీలు లేవు. నీటి ప్రవాహం అపారంగా ఉంది. బస్సు రోడ్డుపై ఆగింది. డ్రైవర్ దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సాహసించలేదు. ఇలోగ భయపడిందే జరిగింది.

Viral Video: వంతెన దాటుతూ వరద నీటిలో కొట్టుకుపోయిన స్కూల్‌ బస్సు.. వైరల్‌ అవుతున్న వీడియో
School Bus
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 19, 2022 | 7:07 PM

దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లు, చెట్లు, పశువులు, రోడ్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోతున్న అనేకం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో స్కూల్ బస్సు వరద నీటిలోకి వచ్చింది . రోడ్డుకు ఇరువైపులా ప్రహరీలు లేవు. నీటి ప్రవాహం అపారంగా ఉంది. బస్సు రోడ్డుపై ఆగింది. డ్రైవర్ దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సాహసించలేదు. ఇలోగ భయపడిందే జరిగింది. వరద నీరు రోడ్డుపై ఉన్న బస్సును ఈడ్చుకెళ్లింది.. చివరకు ఆ బస్సు నదిలో పడింది. ఈ ఉత్కంఠభరితమైన సంఘటనను రోడ్డుకు అవతలి వైపు నిలబడిన వారు మొబైల్‌లో వీడియో తీశారు . ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన వరద నీటిలో వాహనాలు నడపడం ప్రాణాంతకం అనే వాస్తవాన్ని మరోమారు రుజువు చేస్తోంది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. చంపావత్‌లో బస్సు వరద నీటిలో కొట్టుకుపోవడం కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించిన లైవ్ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన తనక్‌పూర్‌లోని కిరోడా బర్సాతి కెనాల్ వద్ద చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ స్థానికుల సహాయంతో బస్సు డ్రైవర్, అతని సహాయకుడిని ప్రజలు ఎలాగోలా బయటకు తీశారు. కాబట్టి వారిద్దరూ రక్షింపబడ్డారు. అయితే వరద నీటిలో నుంచి బయటకు తీయగానే తాము చేసిన తప్పేంటో అర్థమైంది. అదృష్టవశాత్తూ ఈసారి బస్సులో విద్యార్థులేవరూ లేకపోవటంతో పెను విపత్తు తప్పిందనే చెప్పాలి. ఈ ఘటన అనంతరం అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పాలనా యంత్రాంగం జేసీబీ సాయంతో వరద నీటిలో బోల్తా పడిన బస్సును బయటకు తీశారు. బస్సుకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో బస్సు బోల్తా పడిన ప్రదేశంలో గతంలొ పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ స్థలంలో వంతెన నిర్మించాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా ఉంది. అయితే ఈ స్థలంలో వంతెన లేకపోవడంతో వరద నీరు రోడ్డుపైకి వస్తుంది. పాఠశాల బస్సుల వంటి భారీ వాహనాలను సులభంగా తుడిచివేస్తుంది ఇక్కడ ప్రవహించే వరదనీరు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వంతెన ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి