కర్నాటకలో అత్యంత అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం… మీరెప్పుడైనా చూశారా ??
శ్వేతనాగు.. ఈ పేరు వినడమే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూసిన దాఖలాలు లేవు. ఆ మధ్య సౌందర్య నటించిన శ్వేతనాగు సినిమాలో చూసాం. కానీ అలాంటి పాము ఉంటుందా అని చాలామందికి డౌట్ వచ్చింది.
శ్వేతనాగు.. ఈ పేరు వినడమే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూసిన దాఖలాలు లేవు. ఆ మధ్య సౌందర్య నటించిన శ్వేతనాగు సినిమాలో చూసాం. కానీ అలాంటి పాము ఉంటుందా అని చాలామందికి డౌట్ వచ్చింది. అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి పాములు కనిపించడం అందుకు కారణం. తాజాగా శ్వేతవర్ణంలో ఉన్న ఓ నాగుపాము కర్ణాటక శివమొగ్గలోని సహ్యాద్రి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక ఉన్న ఓ ఇంట్లో పాము ప్రత్యక్షమైంది. ట్టెల కుప్పలో కనిపించిన ఈ పాము పూర్తిగా తెలుపు రంగులో ఉంది. మాములుగా తాచుపాములు.. గోధుమ, నలుపు రంగుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. పల్లెలు, పట్నాల్లో సైతం ఇవే కనిపిస్తాయి. కానీ ఈ అరుదైన పాము మాత్రం పూర్తిగా దవళ వర్ణంలో ఉంది. ఈ అరుదైన శ్వేతనాగును అల్బినో కోబ్రా అని పిలుస్తారు. కాగా ఈ శ్వేతనాగు గురించి సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకున్నాడు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ తీసుకొని ఈ సర్పాన్ని అడవిలో విడిచిపెడతామని అతను తెలిపాడు. చర్మ, రక్త సంబంధిత కారణాల వల్లే పాములకు ఇలాంటి శ్వేతవర్ణం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెన్నైలో వింత ఘటన !! చెస్ బోర్డ్‌లా మారిపోయిన నేపియర్ బ్రిడ్జ్
నదీ తీరానికి వెళ్లిన వ్యక్తికి మెరుస్తూ కనిపించిన వస్తువు !! దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అద్భుతం !!