నదీ తీరానికి వెళ్లిన వ్యక్తికి మెరుస్తూ కనిపించిన వస్తువు !! దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అద్భుతం !!

నదీ తీరానికి వెళ్లిన వ్యక్తికి మెరుస్తూ కనిపించిన వస్తువు !! దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అద్భుతం !!

Phani CH

|

Updated on: Jul 19, 2022 | 6:31 PM

శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో శివుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భక్తులు శ్రావణ మాసంలో శివుడిని భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు.

శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో శివుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భక్తులు శ్రావణ మాసంలో శివుడిని భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు. నిశ్చలమైన మనస్సుతో కొలిస్తే.. శివుడు ప్రసన్నుడై అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర మాసంలో భక్తులు శివలింగానికి నీళ్లు, పాలు, బిల్వపత్రాలు మొదలైన వాటిని సమర్పిస్తారు. అయితే శ్రావణ మాసం ప్రారంభానికి ముందే యూపీలోని మౌ జిల్లాలో సరయూ నది వంతెన కింద ఇసుకలో భారీ వెండి శివలింగం కనిపించింది . ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఘఘ్రా నదీ తీరానికి వెళ్లిన ఓ వ్యక్తికి దూరం నుంచి ఓ వస్తువుమెరుస్తూ కనిపించింది. దాంతో అతను ఏమై ఉంటుందా అని దగ్గరికి వెళ్లి పరిశీలించగా..అది వెండి శివలింగం అని నిర్ధారణ అయ్యింది. శివలింగం దొరికిందని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని విచారించి శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు శివయ్య దర్శనం కోసం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పూజలు చేశారు. శివలింగం ఎత్తు ఒకటిన్నర అడుగులు ఉండగా.. బరువు 25 నుండి 30 కిలోలు ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘హర హర మహాదేవ’ అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టగా.. ‘భగవంతుడు భూమిపైకి తిరిగి వస్తున్నాడు, కలియుగం ముగింపు దగ్గర పడినట్లు కనిపిస్తోంది’ అని మరో యూజర్ కామెంట్‌ చేసారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Brigida Saga: ఆ హీరో కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

ప్రేమంటే ఇదేరా.. చెల్లెలి కోసం బుడ్డొడి సాహాసం.. వీడియో చూస్తే ఆశ్చర్య పోతారు అంతే..

Viral: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూస్తే దడదడే

Viral: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూస్తే దడదడే

భారీ కొండ చిలువలతో మసాజ్‌.. మసాజ్‌ సెంటర్లకు యువతులు క్యూ

Published on: Jul 19, 2022 05:49 PM