Viral: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూస్తే దడదడే
ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలను మనం ఇంటర్నెట్ లో అనేకం చూస్తాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే… మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి.
ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలను మనం ఇంటర్నెట్ లో అనేకం చూస్తాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే… మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలంటే నెటిజన్లు తెగ ఇష్టపడతారు. తాజాగా ఆవులు, ఓ పక్షికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన జనాలు అవాక్కవుతున్నారు. ఈ వీడియోలో పొలం మధ్యలో ఒక పక్షి నిలబడి ఉంది. అంతలోనే అటుగా ఓ ఆవుల మంద గడ్డి మేస్తూ వచ్చింది. ఆవులను చూసిన ఆ పక్షి ఏ మాత్రం భయపడకుండా అలాగే నిలబడి ఉంటుంది. ఇంతలో ఒక ఆవు ముందుకొచ్చి పక్షిని బెదిరించింది. అయినా తగ్గలేదు పక్షి. ఇంకో ఆవు ప్రయత్నించింది.. ఛాన్సే లేదు.. మీ బెదిరింపులకు భయపడేదాన్ని కాదు నేను అన్నట్టుగా ఆ పక్షిని ఆవులపై రివర్స్ ఎటాక్ చేసింది. ఆవులు ఎంత ప్రయత్నించిన పక్షి వెనక్కి తగ్గకపోయేసరికి.. ఇది మామూలు పక్షి కాదు.. మహా ముదురు.. అనుకుంటూ ఆవులన్నీ తమ దారిన వెళ్లిపోయాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూనే నవ్వుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ కొండ చిలువలతో మసాజ్.. మసాజ్ సెంటర్లకు యువతులు క్యూ
Viral: ఓరి దేవుడో !! సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై వింతజీవి దాడి
ఎడ్లపై భారం పడకుండా వినూత్న ఐడియా.. ఈ రైతన్నకు సెల్యూట్ చేయాల్సిందే
చిన్నారి అద్భుత ట్యాలెంట్.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్న నెటిజనం
ప్రభుదేవా స్టెప్పులు యాజిటీజ్ దించేస్తున్న లుంగీ బాబాయ్.. వీడియో వైరల్