చెన్నైలో వింత ఘటన !! చెస్ బోర్డ్‌లా మారిపోయిన నేపియర్ బ్రిడ్జ్
తమిళనాడులో వింతఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి ఓ వంతెన చెస్ బోర్డ్‌లా మారిపోయింది. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందంటే..
తమిళనాడులో వింతఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి ఓ వంతెన చెస్ బోర్డ్‌లా మారిపోయింది. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందంటే.. రాష్ట్ర రాజధాని చెన్నైలో నేపియర్ బ్రిడ్జి ఓ ల్యాండ్ మార్క్ లాంటింది. ఇప్పటి వరకూ ఈ వంతెన బాగానే ఉంది. సడన్‌గా జూలై 16 ఉదయం చూసేసరికి ఆ బ్రిడ్జ్ కాస్తా చెస్ బోర్డుగా మారిపోయింది. బ్రిడ్జి ఉపరితలంతో పాటు బ్రిడ్జికి ఉన్న రెయిలింగ్ గోడలు కూడా చెస్ బోర్డు మాదిరిగా మారిపోయాయి. బ్రిడ్జి మొత్తం చెస్ బోర్డులోని తెలుపు, నలుపు గళ్లతో నిండిపోయింది. రాత్రికి రాత్రే ఇలా మారిపోయిన ఈ బ్రిడ్జి ఇప్పుడు చెన్నైవాసులను ఆకట్టుకుంటోంది. ఈ బ్రిడ్జి ఇలా మారిపోవడానికి ఓ కారణం ఉంది. తమిళనాడులోని మామళ్లాపురంలో జూలై 28 నుంచి 44వ ఫైడ్ చెస్ ఒలింపియాడ్ మొదలు కానుంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫైడ్) ఆధ్వర్యంలో జరగనున్న ఈ చెస్ ఒలింపియాడ్‌కు గుర్తుగా నేపియర్ బ్రిడ్జిపై పెయింట్ వేసి ఇలా చెస్ బోర్డ్‌లా మార్చేశారు. అదీ అసలు సంగతి. ఏది ఏమైనా చెస్ బోర్డ్‌లా కనిపిస్తున్న ఈ వంతెన చూపరులను ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నదీ తీరానికి వెళ్లిన వ్యక్తికి మెరుస్తూ కనిపించిన వస్తువు !! దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అద్భుతం !!
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

