AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: డీకే, డీకే అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. ఆగ్రహించిన మురళీ విజయ్.. వద్దంటూ దండం.. నెట్టింట వైరల్

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్.. ప్రస్తుతం టీఎన్‌పీఎల్‌లో ఆడుతున్నాడు. సెంచరీ చేసి తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన విజయ్.. ప్రస్తుతం మైదానంలో అభిమానులకు బలవ్వాల్సి వచ్చింది.

Watch Video: డీకే, డీకే అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. ఆగ్రహించిన మురళీ విజయ్.. వద్దంటూ దండం.. నెట్టింట వైరల్
Murali Vijay
Venkata Chari
|

Updated on: Jul 19, 2022 | 6:26 PM

Share

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కానీ, క్రికెట్ మైదానంలో మాత్రం తన సత్తా చాటుతూనే ఉన్నాడు. మురళీ విజయ్ చాలా కాలం తర్వాత ఇటీవల క్రికెట్ మైదానంలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో బ్యాట్‌తో సత్తా చాటుతున్నాడు. అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఇంతలోనే మురళీ విజయ్ ఈ టోర్నీలో అభిమానులకు బలవ్వాల్సి వచ్చింది. లైవ్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. మురళీ విజయ్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనపై అభిమానులు నిరంతంర ఆటపట్టిస్తూనే ఉన్నారు.

మురళీ విజయ్ ముందు దినేష్ కార్తీక్ నినాదాలు..

ఇవి కూడా చదవండి

TNPL మ్యాచ్ సమయంలో మురళీ విజయ్ ఫీల్డింగ్ చేసేందుకు వచ్చాడు. దీంతో అభిమానులు మురళీ విజయ్‌ను ఆటపట్టించేందుకు DK-DK అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇబ్బందిగా ఫీలైన మురళీ విజయ్.. అభిమానులకు చేతులు జోడించి మరీ దండం పెట్టాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ మ్యాచ్‌లో, మురళీ విజయ్ బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నట్లు చూడొచ్చు.

దినేష్ కార్తీక్ పేరు ఎందుకొచ్చిందంటే?

మురళీ విజయ్ ముందు దినేష్ కార్తీక్ పేరును ఎందుకు పిలిచారో తెలుసా? దినేష్ కార్తీక్ మొదటి భార్య నికితను మురళీ విజయ్ పెళ్లాడాడు. మురళీ విజయ్‌తో సన్నిహితంగా మెలిగిన తర్వాతనే విడాకులు తీసుకోవాలని దినేష్ కార్తీక్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ వివాదం చర్చనీయాంశం అయింది. దీంతో కార్తీక్ ఓ దశలో ఎంతో లోతుకు పడిపోయాడు. టీమిండియా నుంచి కూడా దూరమయ్యాడు. అనంతరం విడాకుల తర్వాత, కార్తీక్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు. తాజాగా ఆమె కవలలకు తల్లి అయింది.

Follow Us
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..