దారుణం.. రెచ్చిపోయిన మైనింగ్‌ మాఫియా.. ట్రక్కుతో డీఎస్పీని తొక్కించి చంపేశారు

రెచ్చిపోయిన మైనింగ్‌ మాఫియా ఏకంగా ఓ డీఎస్పీనే ట్రక్కుతో తొక్కించి చంపేసింది. అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన ఓ డీఎస్పీని ఘటనా స్థలంలోనే హతమార్చారు.

దారుణం.. రెచ్చిపోయిన మైనింగ్‌ మాఫియా.. ట్రక్కుతో డీఎస్పీని తొక్కించి చంపేశారు
Dsp Killed
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 19, 2022 | 4:54 PM

Haryana Horror: హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన మైనింగ్‌ మాఫియా ఏకంగా ఓ డీఎస్పీనే ట్రక్కుతో తొక్కించి చంపేసింది. అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన ఓ డీఎస్పీని ఘటనా స్థలంలోనే హతమార్చారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే. హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో ఉన్న నుహ్ పచ్‌గావ్ పరిధిలో జులై 19న ఈ దారుణ ఘటన జరిగింది. గనుల్లో అక్రమంగా రాయిని తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న మెవాట్ డీఎస్పీ సురేంద్ర సింఘ్ బిష్ణోయ్‌ సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ అక్రమంగా రాళ్లను తరలిస్తున్న ఒక ట్రక్కు వెళ్తుండటం గమనించాడు.

ఇల్లీగల్ గా రాళ్లను తరలిస్తున్న వాహనానికి అడ్డుగా నిలబడి ఆపేయాలని చెప్పారు..కానీ, ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నేరుగా ఆయన పైకి ఎక్కించాడు. దీంతో డీఎస్పీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు ప్రాణాలతో బయటపడ్డారు. వాహనం దూసుకొస్తున్న సమయంలో వారిద్దరూ దారి పక్కకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇవి కూడా చదవండి

అయితే, జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హర్యాణా పోలీసు శాఖ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని చట్టం ముందు నిలబెడతామని ట్వీట్ చేసింది.

నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. త్వరలోనే నిందితులకు శిక్షపడేలా చేస్తామని పోలీసులు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి