Sparrow in Cockpit: 37 వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్కసారిగా అది కనిపించడంతో..

Sparrow in Cockpit: ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం బయలుదేరింది. ఫర్‌ఫెక్ట్‌గా టేకాఫ్ తీసుకుంది. దాదాపు 37,000 అడుగుల ఎత్తులో ఏ టెన్షన్ లేకుండా..

Sparrow in Cockpit: 37 వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్కసారిగా అది కనిపించడంతో..
Plane
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 19, 2022 | 6:08 PM

Sparrow in Cockpit: ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం బయలుదేరింది. ఫర్‌ఫెక్ట్‌గా టేకాఫ్ తీసుకుంది. దాదాపు 37,000 అడుగుల ఎత్తులో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వెళుతోంది. ఇంతలోనే ఓ షాకింగ్ సీన్.. విమాన సిబ్బంది సహా ఏవియేషన్ అధికారులను హడలెత్తించింది. ఒకసారి కాదు.. రెండుసార్లు ఈ అలజడి రేగింది. తొలిసారి హమ్మయ్య అనుకునే లోపే.. రెండోసారి దడపుట్టించింది. ఇంతకీ వారిని అంతలా భయపెట్టించింది ఏంటో తెలుసా? ఓ పిచ్చుక. అవును.. ఎగురుతున్న విమానం కాక్‌పిట్‌లో పిచ్చుక హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బహ్రెయిన్ నుంయి కొచ్చి కి తిరిగి వస్తోంది. ఆ సమయంలో కాక్‌పిట్‌ సెక్యూరిటి చెకప్ చేయగా.. పిచ్చుక కనిపించింది. విమాన సిబ్బంది దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పక్షి బయటకు వెళ్లేందుకు ఫ్లైట్ డెక్ కిటికీలను ఓపెన్ చేశారు. 10 నిమిషాల తరువాత సిబ్బంది మళ్లీ కాక్‌పిట్‌ను చెక్ చేశారు. ఆ సమయంలో పిచ్చుక కనిపించలేదు. దాంతో విమానం టేకాఫ్ అయ్యింది. సరిగ్గా 37,000 అడుగుల ఎత్తులోకి వెళ్లాక పిచ్చుక మళ్లీ దర్శనమిచ్చింది. గ్లాస్ కంపార్ట్‌మెంట్ వద్ద అనుకోని విధంగా పిచ్చుక బయటకు వచ్చింది. అప్పటి నుంచి కొచ్చి కి వచ్చేంత వరకు పిచ్చుక అలాగే విమానంలో ఉండిపోయింది. కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక.. సిబ్బంది ఆ పిచ్చుకను పట్టుకుని బయటకు వదిలేశారు. కాగా, ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఫైర్ అయ్యింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. భద్రతా లోపాల దృష్ట్యా తక్షణమే నివేదిక సమర్పించాలని ఎయిర్‌లైన్స్ కంపెనీని డీజీసీఏ ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..