Indian Railway: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆ రూ.50 చెల్లించాల్సిన అవసరం లేదు
Indian Railway: దేశంలోనే అతిపెద్ద రవాణ వ్యవస్థ అయిన రైల్వే శాఖ ప్రయాణికుల కోసం కీలక నిర్ణయాలు తీసుకువస్తుంటుంది. అతి తక్కువ ఛార్జీలతో ఉండే రైలు ప్రయాణాన్ని..
Indian Railway: దేశంలోనే అతిపెద్ద రవాణ వ్యవస్థ అయిన రైల్వే శాఖ ప్రయాణికుల కోసం కీలక నిర్ణయాలు తీసుకువస్తుంటుంది. అతి తక్కువ ఛార్జీలతో ఉండే రైలు ప్రయాణాన్ని సామాన్యులు సైతం ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తెస్తుంటుంది రైల్వే శాఖ. ఇక ప్రీమియం రైళ్లలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆర్డర్ చేయడం వల్ల రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే సమయంలో ముందుగా బుక్ చేసుకోని ప్రయాణికులకు రూ.50 అదనంగా ఉండేది. అయితే రైళ్లలో విక్రయించే ఆహారం, శీతల పానీయాలపై ప్రయాణికులకు కాస్తా ఊరటనిచ్చింది రైల్వే శాఖ. ఆహారం, కూల్ డ్రింక్స్‌ను ముందుగా బుక్ చేసుకోని వారికి విక్రయించిన సందర్భంలో గతంలో ఆన్-బోర్డ్ సర్వీస్ ఛార్జ్ పేరుతో రైల్వే రూ.50 అదనంగా వసూలు చేసేది. రైల్వే శాఖ తాజాగా ఈ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని, దూరంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియమ్ రైళ్లలో భోజనం, టీ, కాఫీ, కూల్‌డ్రింక్ వంటివి ముందుగా బుక్ చేసుకోకుండా ప్రయాణంలో అప్పటికప్పుడు కొనుగోలు చేసే ప్రయాణికులకు ఈ ఊరట కల్పించింది. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గత నిబంధనల ప్రకారం.. ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు టికెట్‌తోపాటు ఆహారం బుక్ చేసుకోకపోతే ప్రయాణంలో కొనుగోలు చేసినట్లయితే రూ.50 అదనంగా చెల్లించాల్సి వచ్చేది. రూ.20కు విక్రయించే టీ, కాఫీకి అదనంగా రూ.50 చెల్లించాల్సిందే. అంటే టీ, కాఫీ తాగాలన్నా సర్వీస్ ఛార్జ్‌తో కలిపి రూ.70 అవుతుంది. ఇకపై పరిస్థితి అలా ఉండదు. ముందుగా బుక్ చేసుకోకపోయినా టీ. కాఫీ రూ.20కే లభిస్తుంది. రద్దు చేసిన రూ.50 సర్వీస్ ఛార్జ్ కేవలం టీ, కాఫీ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తించనుంది.
అయితే.. ఆన్‌బోర్డ్ సర్వీస్ ఛార్జీలను రద్దు చేసినప్పటికీ స్నాక్స్, లంచ్, డిన్నర్ మీల్స్‌కు రూ.50 అదనంగా వసూలు చేయడం గమనార్హం. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, దురం ఎక్స్‌ప్రెస్‌తో సహా అన్ని ప్రీమియం రైళ్లకు కొత్త క్యాటరింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (1A లేదా EC క్లాస్) కోసం టికెట్ బుకింగ్ సమయంలో భోజనాన్ని ఎంచుకోకపోతే ప్రయాణికులు అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ కోసం రూ.140కి బదులుగా రూ.190 చెల్లించాలి.
☛ లంచ్, డిన్నర్ కోసం ప్రయాణికులు రూ.240కి బదులుగా రూ.290 చెల్లించాల్సి ఉంటుంది.
☛ రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (2AC/3A/CC) 2AC/3A/CCలో ప్రయాణించే ప్రయాణికులు ఉదయం అల్పాహారం కోసం రూ.105కి బదులుగా రూ.155 చెల్లించాలి.
☛ సాయంత్రం స్నాక్స్ కోసం రూ.90కి బదులుగా రూ.140.
☛ లంచ్, డిన్నర్ కోసం రూ.185కి బదులుగా రూ.235.
☛ వందే భారత్: అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ధరలు
☛ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారు అల్పాహారం కోసం రూ.155కి బదులుగా రూ.205 చెల్లించాలి.
☛ సాయంత్రం అల్పాహారం కోసం, రూ.105కి బదులుగా రూ.155.
☛ లంచ్, డిన్నర్ కోసం రూ.244కి బదులుగా రూ.294 చెల్లించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి