ప్రేమ విఫలమై.. ఐఏఎస్‌ కావలసినవాడు పిచ్చివాడయ్యాడు

ప్రేమ విఫలమై.. ఐఏఎస్‌ కావలసినవాడు పిచ్చివాడయ్యాడు

Phani CH

|

Updated on: Jul 22, 2022 | 7:48 PM

ప్రేమ ఎప్పుడు ఎవరిలో ఎలా పుడుతుందో... వారి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే ప్రేమ విజయవంతమైతే ఓకే... కానీ విఫలమైతే జీవితం అధోగతి పాలవడం ఖాయం.

ప్రేమ ఎప్పుడు ఎవరిలో ఎలా పుడుతుందో… వారి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే ప్రేమ విజయవంతమైతే ఓకే… కానీ విఫలమైతే జీవితం అధోగతి పాలవడం ఖాయం. అందుకు నిదర్శనమే ఈ వ్యక్తి జీవితం.. ప్రేమ విఫలం కావడంతో ఐఏఎస్‌ కావలసిన వ్యక్తి పిచ్చివాడయ్యాడు. వివారల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన ఓ యువకుడు ఎంబీఏ చదివాడు. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డాడు. ఒకసారి కాదు రెండు సార్లు ప్రేమలో విఫలం అయ్యాడు.. దాంతో బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలేసాడు. మతి తప్పి రోడ్డున పడ్డాడు. పిచ్చివాడిలా చెన్నై నుంచి కాలినడకన కన్యాకుమారికి చేరుకుని బిచ్చగాడిలా మారిపోయాడు. కన్యాకుమారి రైల్వేస్టేషన్‌ సమీపంలోని బ్యాంకు ఫ్లాట్‌ఫారంనే నివాసంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పుడు ఇంగ్లీష్‌ వార్తాపత్రికలను చదువుతూ ఉండటం.. ఆ మార్గంలో వచ్చిపోయే వారు.. ఇచ్చే ఆహార పదార్థాలను తింటూ ఆకలి తీర్చుకుంటూ జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా, తెన్‌కాశీ జిల్లా తెన్నమలై ప్రాంతానికి చెందిన మురుగన్‌ అనే వ్యక్తి జూలై 17వ తేదీన తన కుటుంబ సభ్యులతో కన్యాకుమారికి వచ్చాడు. చినిగిపోయిన బట్టలు కట్టుకుని, మాసిన గడ్డంతో, మానసిక వైకల్యంతో రోడ్డుపై ఉన్న యువకుడిని గమనించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: ఐస్‌క్రీమ్‌ కోసం శునకం కష్టాలు.. ఎంత లాగినా రాదాయే

జీపు బానెట్ పై కూర్చున్న వ్యక్తి !! ఎదురుగా అనుకోని అతిథి ప్రత్యక్షం !!

మిమిక్రీ అదరగొడుతున్న పక్షి.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు

Viral: మ్యాగ్నెట్‌ మ్యాన్‌.. క్యాన్లకు అతుక్కుపోతాడు

Published on: Jul 22, 2022 07:48 PM