మిమిక్రీ అదరగొడుతున్న పక్షి.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు
ఈ వీడియోని ట్విట్టర్ యూజర్ నవీన్ కుమార్ జిందాల్ తన అకౌంట్ లో పోస్ట్ చేశారు. "మన సనాతన ధర్మం ఏం బోధిస్తోందో చూడండి. ఆ పక్షి వాయిస్ ఎంత బాగుందో" అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోని ట్విట్టర్ యూజర్ నవీన్ కుమార్ జిందాల్ తన అకౌంట్ లో పోస్ట్ చేశారు. “మన సనాతన ధర్మం ఏం బోధిస్తోందో చూడండి. ఆ పక్షి వాయిస్ ఎంత బాగుందో” అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో వర్షం, గాలి వస్తున్న సమయంలో… తనను తాను రక్షించుకునేందుకు ఓ గోరింక ఓ ఇంట్లోకి వచ్చింది. ఆ ఇంట్లో వారు దానితో మాట్లాడించేందుకు ప్రయత్నించారు. వారు హరే కృష్ణ.. హరే కృష్ణ అంటుంటే.. ఆ పక్షి తనకు వచ్చిన విధంగా పలుకుతోంది. దానికి హరిభోల్.. హరిభోల్ అని చెప్పగా… ఆ పక్షి దాదాపు అలా చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత మరోసారి వాళ్లు హరే కృష్ణ అని మూడుసార్లు పలికితే… ఆ పక్షి అలా పలకలేక.. ఈల వేసింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. “చిలుకలు మాట్లాడుతూనే ఉంటాయి, మొదటిసారిగా గోరింక మాట్లాడటం విన్నాం” చాలా బావుంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: