Viral: మ్యాగ్నెట్ మ్యాన్.. క్యాన్లకు అతుక్కుపోతాడు
కూల్‌డ్రింక్స్ క్యాన్లను తలకు అతికించుకుని గిన్నిస్ రికార్డు సాధించాడో వ్యక్తి. అమెరికాలో జామీ కీటన్‌ది అసాధారణ చర్మం. ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునే లక్షణం ఉన్న జామీ చర్మానికి అతుక్కునే గుణం ఎక్కువ.
కూల్‌డ్రింక్స్ క్యాన్లను తలకు అతికించుకుని గిన్నిస్ రికార్డు సాధించాడో వ్యక్తి. అమెరికాలో జామీ కీటన్‌ది అసాధారణ చర్మం. ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునే లక్షణం ఉన్న జామీ చర్మానికి అతుక్కునే గుణం ఎక్కువ. ఏడేళ్ల వయసులోనే ఇది గుర్తించిన జామీ… బొమ్మలు అతికించుకోవడం మొదలుపెట్టాడు. అల్లరివాడు కాబట్టి ఏ చెట్లెక్కి గమ్ అంటించుకున్నాడోనని అతని తల్లిదండ్రులు తేలికగా తీసుకున్నారు. కానీ ఓసారి గుండు చేసుకుని బేస్‌బాల్ ఆడుతున్న టైమ్‌లో తలకు కూల్‌డ్రింక్ టిన్ అతుక్కుపోయింది. పరుగెత్తినా పడిపోలేదు. అలా తనలోని ప్రత్యేకతను తెలుసుకున్నాడు జామీ. 2016లో తలకు 8 క్యాన్లను అతికించుకొని గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత 2019లో జపాన్‌కు చెందిన షునుచి తొమ్మిది క్యాన్లతో జామీ రికార్డును బ్రేక్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి