Viral Video: స్కూబా డైవింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి.. దూసుకువచ్చిన అనుకోని అతిథి.. వైరల్ వీడియో
చిన్న పాములనుంచి, పెద్ద పెద్ద కొండచిలువల వరకు వీడియో లు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే అనకొండను జనాలు సినిమాల్లోనే చూశారు. నిజంగా చూడటం చాలా అరుదు. అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా పరిగణించబడుతుంది..
Viral Video: చిన్న పాములనుంచి, పెద్ద పెద్ద కొండచిలువల వరకు వీడియో లు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే అనకొండను జనాలు సినిమాల్లోనే చూశారు. నిజంగా చూడటం చాలా అరుదు. అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా పరిగణించబడుతుంది.. మనిషి అయినా, జంతువు అయినా ఒక్కసారి అనకొండకు చిక్కితే తప్పించుకోవడం అసాధ్యం. ఇప్పుడు అనకొండకు సంబంధించిన వీవోద్యో ఒకటి వైరల్ అవుతోంది. ఇది కాస్త పాతదే అయినా ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో, స్కూబా డైవింగ్ కిట్ ధరించిన యువకుడు సముద్రంలోకి వెళ్లడాన్ని మీరు చూడవచ్చు. సాహసంగా సముద్రంలోకి వెళ్లిన యువకుడికి ఓ భారీ అనకొండ భారీ షాక్ ఇచ్చింది.
స్కూబా డైవింగ్ చేసిన వ్యక్తి ఓ భారీ అనకొండ ముందు పడ్డాడు. అనకొండ నెమ్మదిగా ఆ యువకుడి వద్దకు ఈదుకుంటూ వచ్చింది. అదృష్టవశాత్తూ అది అతడిని ఏమీ చేయలేదు. సాధారణంగా ఎరను చూడగానే పోరాడి పట్టుకునే అనకొండ ఈసారి ఏమీ చేయలేదు. ఈ వీడియో యూట్యూబ్ ఛానెల్ CGTN ద్వారా అప్‌లోడ్ చేయబడింది. అనకొండ సుమారు 23 అడుగుల పొడవు , 90 కిలోలలకు పైగా బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వీడియోలో యువకుడి వైపు భారీ అనకొండ వస్తున్నప్పుడు మన ఊపిరి ఒక్కసారిగా ఆగిపోతుంది.. వైరల్ అయిన ఈ వీడియోకి 4,639,489 వ్యూస్, 9.2k లైక్‌లు వచ్చాయి. అనకొండలు 30 అడుగుల పొడవు మరియు 250 కిలోల వరకు బరువు పెరుగుతాయి. భూమిపై కంటే నీటిలోనే వేగంగా వేటాడడం దీని ప్రత్యేకత.