Viral Video: పాముతోనే పరాచకాలా.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కింగ్ కోబ్రా..
ప్రమాదకరమైన ప్రాణులతో ఆడుకోవడానికి కొంతమంది వెనకాడరు. ప్రాణం మీద తీపిలేనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రమాదకరమైన జంతువులతో , పాములతో ఆటలాడుకోవడం కొంతమందికి సరదా..
Viral Video: ప్రమాదకరమైన ప్రాణులతో ఆడుకోవడానికి కొంతమంది వెనకాడరు. ప్రాణం మీద తీపిలేనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రమాదకరమైన జంతువులతో , పాములతో ఆటలాడుకోవడం కొంతమందికి సరదా.. అయితే కొన్ని సార్లు అవి రివర్స్ అవుతూ ఉంటాయి. అలాంటి దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. పాములు చాలా ప్రమాదకరమైనవి.. వాటితో ఆటలాడటం ఇంకా ప్రమాదం. కొంతమంది మాత్రం వాటిని బొమ్మలా భావించి ఆటలాడుతూ ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి పొడవాటి పాముతో ఆటలాడే ప్రయత్నం చేశాడు. చివరకు అది చేసిన పనికి షాక్ అయ్యాడు.
ఈ వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి తన చేతిలో పొడవాటి పామును పట్టుకోవడం మీరు చూడవచ్చు. ఇది చూడటానికి నిజంగా భయంగా ఉంది. బహిరంగ ప్రదేశంలో నిలబడి ఉన్న వ్యక్తిని మనం చూడవచ్చు. అతను తన చేతుల్లో పొడవైన,ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. మొదట్లో పాము చాలా ప్రశాంతంగా కనిపించినా కొంత సమయం తర్వాత ఆ వ్యక్తిపై దాడి చేస్తుంది. పాము నుండి తప్పించుకోవడానికి అతను త్వరగా తల తిప్పడం కూడా మీరు చూడవచ్చు. ఏది ఏమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి
View this post on Instagram