Viral: నడిరోడ్డుపై ముద్దులతో రచ్చ.. స్టూడెంట్స్ ‘లిప్ లాక్ ఛాలెంజ్’.. సీన్ కట్ చేస్తే.!
లాక్‌డౌన్ టైంలో ఎన్నో రకాల ఛాలెంజ్‌లను మనం చూసే ఉంటాం. వాటిల్లో కొన్ని మనకు ఉపయోగపడగా..
లాక్‌డౌన్ టైంలో ఎన్నో రకాల ఛాలెంజ్‌లను మనం చూసే ఉంటాం. వాటిల్లో కొన్ని మనకు ఉపయోగపడగా.. మరికొన్ని మనస్సును ఆహ్లాదపరిచాయి. అయితే ఇప్పుడు మేము మీకు చెప్పబోయే ఛాలెంజ్.. వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. అదే ‘లిప్ లాక్ ఛాలెంజ్’. ఈ ఛాలెంజ్ పేరిట కర్ణాటకలో స్టూడెంట్స్ నడిరోడ్డుపై నానా రచ్చ చేశారు. ఇంతకీ ఆ కథేంటంటే.!
వివరాల్లోకి వెళ్తే.. మంగళూరులో ఓ ప్రైవేటు కాలేజీ స్టూడెంట్స్ నడిరోడ్డుపై ముద్దుల సవాళ్లతో రెచ్చిపోయారు. నగరంలోని ఓ కాలనీలో వాళ్లు ఈ ఛాలెంజ్ తలపెట్టగా.. ఓ ఇంటి ముందు అమ్మాయి, అబ్బాయి పోటీపడి మరీ ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇక పక్కన చేరిన తోటి విద్యార్ధులు ‘కమాన్.. కమాన్’ అంటూ వారిని ఎంకరేజ్ చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ ముద్దుల ఛాలెంజ్ పేరిట వీళ్లు చేసిన హంగామాకు ఇబ్బంది పడ్డ ఆ కాలనీవాసులు.. పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని దక్షిణ ప్రాంతమంతా ఒక్కసారిగా దుమారం రేగింది.
కాగా, లిప్‌లాక్ ఛాలెంజ్‌లలో కనిపించిన 8 మంది విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది అబ్బాయిలు.. ఇద్దరు అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. వారిపై సెక్షన్ 376, 354, 354(C), 120B, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.