Viral: ఐస్‌క్రీమ్ కోసం శునకం కష్టాలు.. ఎంత లాగినా రాదాయే
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లంతా తెగ నవ్వుకుంటున్నారు. ఓ కుక్క ఐస్ క్రీం ను తినాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇది చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఐస్ క్రీం అంటే అందరికీ చాలా ఇష్టం. అయితే.. కుక్కలు కూడా ఐస్ క్రీం తినేందుకు తెగ ఇష్టపడుతున్నాయి. అందుకు నిదర్శనం ఈ వైరల్ వీడియోనే. దీనిలో ఉన్న ఓ పెంపుడు కుక్క.. ఐస్‌క్రీం చిత్రాలను చూసి టెంప్ట్ అయ్యింది. ఇక ముందు వెనక ఆలోచించకుండా.. బ్యానర్ మీద ఉన్న ఐస్ క్రీంను తినేందుకు తెగ ప్రయత్నించింది. పాపం అది బొమ్మ అని దానికి తెలియక ఎలాగైనా ఐస్ క్రీమ్ తినాలని తెగ కొరుకుతోంది. ఎంతకీ ఐస్‌క్రీమ్ నోట్లోకి రాకపోవడంతో కాలుతో కూడా ప్రయత్నించింది.. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఓ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను మిలియన్లమంది వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తూ పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీపు బానెట్ పై కూర్చున్న వ్యక్తి !! ఎదురుగా అనుకోని అతిథి ప్రత్యక్షం !!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

