Viral Video: నేనంతే.. బుల్లి స్కూటర్‌పై కాలేజ్‌కు వెళ్తున్న యువకుడు.. వింతగా చూస్తున్న జనం..

బుల్లి స్కూటర్‌పై కాలేజ్‌కు వెళ్తూ.. హైదరాబాద్‌ నగర వీధుల్లో ఓ యువకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లలు ఆడుకునేలాంటి చిన్ని స్కూటర్‌పై కాలేజ్‌కి వెళ్తున్న యువకుడిని చూసి అంతా షాకవుతున్నారు.

Viral Video: నేనంతే.. బుల్లి స్కూటర్‌పై కాలేజ్‌కు వెళ్తున్న యువకుడు.. వింతగా చూస్తున్న జనం..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 25, 2022 | 4:35 PM

Hyderabad Viral Video: నేనంతే.. నా ఇష్టం.. నేను ఇలాంటి పదాలన్నీ సినిమాల పేర్లన్న విషయం తెలిసిందే.. కానీ నిజ జీవితంలో నేనంతే అనేలా ఓ యువకుడు రోడ్లపై రయ్యిరయ్యిన దూసుకెళ్తున్నాడు. బుల్లి స్కూటర్‌పై కాలేజ్‌కు వెళ్తూ.. హైదరాబాద్‌ నగర వీధుల్లో ఓ యువకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లలు ఆడుకునేలాంటి చిన్ని స్కూటర్‌పై కాలేజ్‌కి వెళ్తున్న యువకుడిని చూసి అంతా షాకవుతున్నారు. ఈ దృశ్యం చూస్తే ఎవరో పిల్లాడు ఆడుకుంటూ రోడ్డుమీదకు వచ్చేశాడా అనిపిస్తోంది. కానీ అతను తన చిన్న ఈ స్కూటర్‌పై రోజూ 30 కి.మీ ప్రయాణిస్తూ కళాశాలకు వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అత్తాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఒక చిన్ని ఈ స్కూటర్‌ పైన వెళ్తూ మెహదీపట్నం రోడ్డులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ చిన్ని స్కూటర్‌పై ఎక్కడికి వెళ్తున్నావని అతన్ని కొందరు అడిగారు. అందుకు ఆ యువకుడు సమాధానం చెబుతూ.. తాను వెళ్తున్న వాహనం ఒక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అని, దానిని పటాన్‌చెరులో మాన్యుఫ్యాక్చరింగ్‌ చేస్తున్నారని చెప్పాడు. 4 గంటలు ఛార్జింగ్‌ చేస్తే 50 కిలో మీటర్ల వరకూ ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. అయితే.. తాను ప్రతిరోజూ అత్తాపూర్‌ నుంచి పంజాగుట్టకు ఈ చిన్ని స్కూటర్‌పైనే వస్తుంటానని చెప్పుకొచ్చాడు. దానిపై ప్రయాణం చాలా హాయిగా ఉందని పేర్కొన్నాడు.

వైరల్ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ చిన్న వాహనంపై ట్రాఫిక్‌లో కూడా ఈజీగా వెళ్లిపోగలుగుతున్నానని.. తనకు పెద్దగా ట్రాఫిక్ కష్టాలు ఎదురుకావడం లేదని బదులిచ్చాయి. ఈ విషయం విన్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఏదైనా నువ్వు సూపర్ భయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ