Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: మోడలింగ్‌ అదరగొడుతున్న చిట్టెలుక.. చేత్తో పూలు పట్టుకుని కెమెరాకు ఫోజులు

సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా జంతువులు, చిన్నారులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ....

Video Viral: మోడలింగ్‌ అదరగొడుతున్న చిట్టెలుక.. చేత్తో పూలు పట్టుకుని కెమెరాకు ఫోజులు
Rat Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 25, 2022 | 5:12 PM

సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా జంతువులు, చిన్నారులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ వైరల్ (Viral) అవుతూనే ఉంటాయి. సాధార‌ణంగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఫొటోల‌కు ఫోజులిస్తుంటాయి. అయితే వీటికి పోటీగా ఓ ఎలుక కూడా ఫోటోలకు ఫోజులిస్తోంది. మోడలింగ్‌ చేస్తున్నట్టుగా పూలు చేత్తో పట్టుకొని రకరకాల ఫోజులు ఇస్తూ ఫొటోలు తీయించుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. జూలియన్‌ రాడ్‌ అనే వైల్డ్‌ ఫోటోగ్రాఫర్‌.. అటవీ ప్రాంతంలోకి వెళ్లి, అక్కడ ఒక ఎలుక కన్నం దగ్గర తన కెమెరా పెట్టాడు. విచిత్రంగా ఆ కన్నంలోంచి ఓ అడ‌వి చిట్టెలుక బయటికి వచ్చింది. దానికి కొన్ని పూలు అందించాడు జూలియన్‌. ఇక ఆ ఎలుక పూలు ప‌ట్టుకొని హొయ‌లుపోతూ మోడ‌ల్ లా ఫీల్ అయిపోయింది. ఈ చిట్టెలుక మోడ‌లింగ్ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియో సామాజిక మాధ్యమమైన ట్విట‌ర్‌లో పోస్ట్ అయింది. అంతే కాకుండా ‘మీరెప్పుడైనా అడివి చిట్టెలుక ఫొటోషూట్ చేయ‌డం చూశారా?’ అని క్యాప్షన్ ఇచ్చారు జూలియన్. ఈ వీడియోను మిలియ‌న్ల సంఖ్యలో వీక్షిస్తున్నారు. లక్షలమంది లైక్‌ చేస్తున్నారు. మోడలింగ్ నేర్చుకోవాలంటే ఎలుకను సంప్రదించాలని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్..
డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్..
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. చిక్కుల్లో 'ఎంపురాన్' సినిమా !
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. చిక్కుల్లో 'ఎంపురాన్' సినిమా !
ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ నటి
ఎన్‌సీసీ ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ నటి
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
సర్కార్ బడిలో షాకింగ్ సీన్.. పిల్లల ముందే చితకబాదుకున్న టీచర్లు!
సర్కార్ బడిలో షాకింగ్ సీన్.. పిల్లల ముందే చితకబాదుకున్న టీచర్లు!
ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!
ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!
ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ బద్దలు కొట్టే ఐదు రికార్డ్స్..
ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్ బద్దలు కొట్టే ఐదు రికార్డ్స్..
సైడ్ క్యారెక్టర్స్ టు క్రేజీ హీరోయిన్‌గా..
సైడ్ క్యారెక్టర్స్ టు క్రేజీ హీరోయిన్‌గా..
రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక.. ఏప్రిల్ 1 నుంచి..
రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక.. ఏప్రిల్ 1 నుంచి..
స్టేడియంలో జాస్మిన్ వాలియా! పాండ్యా ప్రేమకథ మళ్లీ హాట్ టాపిక్..
స్టేడియంలో జాస్మిన్ వాలియా! పాండ్యా ప్రేమకథ మళ్లీ హాట్ టాపిక్..