Viral Video: ప్రధాని మోదీ సలహాను సీరియస్‌గా తీసుకున్న విపక్ష నేత.. రాజకీయాలకు అతీతంగా..

పాట్నాలో జరిగిన బీహార్ అసెంబ్లీ భవనం శతవార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్‌తో పాటు ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు.

Viral Video: ప్రధాని మోదీ సలహాను సీరియస్‌గా తీసుకున్న విపక్ష నేత.. రాజకీయాలకు అతీతంగా..
Tejashwi Yadav
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 25, 2022 | 4:03 PM

మంచి విషయాన్ని ఎవరు చెప్పిన వినాలి అంటారు పెద్దలు.. బీహార్‌కు చెందిన ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. వెయిట్ తగ్గించడంపై దృష్టిపెట్టాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు సలహా ఇచ్చారు. రాజకీయంగా చాలా విభేదాలున్నా.. ప్రధాని మోదీ ఇచ్చిన ఫిట్‌నెస్ సలహాను సీరియస్‌గా తీసుకున్నారు తేజస్వి యాదవ్. వెయిట్ లాస్, ఫిట్‌నెస్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీని కోసం గత వారం రోజలుగా ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వి యాదవ్.. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ-జేడీయు కూటమి సర్కారు అధికారంలో ఉంది. నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. గతకొంతకాలంగా బీజేపీ-జేడీయు నేతల మధ్య పొసగడం లేదన్న కథనాలు వినిపిస్తున్నాయి. బీహార్‌ సీఎం పదవి నుంచి నితీష్ కుమార్‌ను తప్పించాలని కొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నితీష్ కుమార్.. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీకి దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో పాట్నాలో జరిగిన బీహార్ అసెంబ్లీ భవనం శతవార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్‌తో పాటు ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కాసేపు తేజస్వి యాదవ్‌తో ముచ్చటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. బరువు కాస్త తగ్గించాలని, ఆరోగ్యకరంగా ఉండటం ఎంతో అవసరమని సలహా ఇచ్చారు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు.

ప్రధాని మోదీ సలహా మేరకు 32 ఏళ్ల తేజస్వి యాదవ్.. ఇప్పుడు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. క్రికెట్ ప్రాక్టీస్‌తో పాటు వెయిట్ లిఫ్టింగ్, జీప్‌ను చేతులతో వెనక్కి లాగడం వంటి కసరత్తు చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలతో తన ఫిట్‌నెస్‌ను తేజస్వి యాదవ్ చాటి చెబుతున్నారు.

రాజకీయంగా ప్రధాని మోదీతో తీవ్ర వైరుద్యాలున్నా.. ఫిట్‌నెస్ విషయంలో ప్రధాని సలహాను తేజస్వి యాదవ్ సీరియస్‌గా తీసుకోవడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై రాజకీయ విమర్శనాస్త్రాలను కొనసాగిస్తున్నారు తేజస్వి యాదవ్.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..