Viral: పాము కాటుతో యువకుడు మృతి.. అతని కుటుంబ సభ్యులు చేసిన పనికి అందరూ షాక్..

పాముకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. కానీ అతడిని తిరిగి బ్రతికించేందుకు అతని కుటుంబ సభ్యులు చాలా రకాల పూజలు చేశారు. వివరాలు...

Viral: పాము కాటుతో యువకుడు మృతి.. అతని కుటుంబ సభ్యులు చేసిన పనికి అందరూ షాక్..
Snake Bite
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 25, 2022 | 3:28 PM

ప్రజంట్ వర్షాకాలం. పుట్టల్లో ఆవాసాలు కోల్పోయిన పాములు.. జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే  పాముకాట్లకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో యూపీ(Uttar Pradesh)లోని మెయిన్​పురి(Mainpuri) జిల్లాలోని జాటవాన్​ మొహల్లా గ్రామానికి చెందిన యువకుడు తాలీబ్ శుక్రవారం తెల్లవారుజామున పాముకాటుకు గురయ్యాడు. అతడని వెంటనే దగ్గర్లోకి హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అయితే తాలీబ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. మళ్లీ అతడిని బతికించుకోవాలని ఉద్దేశంతో.. మాంత్రికులను, తాంత్రికులను.. స్నేక్ క్యాచర్స్‌(Snake Catchers)ను పిలిపించారు. గ్రామస్థులు కూడా ఆ కుటుంబానికి సహకరించారు. 30 గంటల పాటు ఏవేవో పూజలు చేశారు. డప్పులు వాయిస్తూ.. డెడ్ బాడీని ఇంటి ముందు పెట్టి వేప, అరటి కొమ్మలు పెట్టి  కుద్రపూజలు చేశారు. ఈ క్రమంలోనే తాలీబ్‌ను కాటేసిన పామును పట్టేందుకు నలుగురు స్నేక్ క్యాచర్స్‌ను రంగంలోకి దించారు. మూఢ నమ్మకాలు కాకపోతే చనిపోయిన మనిషి ఎలా బ్రతికొస్తాడు చెప్పండి. దీంతో చేసేదేం లేక.. గ్రామ పెద్దలు వారించడంతో.. ఆదివారం సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.

Snake Bite

పాముకాటుతో చనిపోయిన యువకుడు

పంజాబ్‌లో పనిచేసే తాలీబ్ 10 రోజుల క్రితమే సొంతూరుకు వచ్చాడు. ఇలా పాము కాటుకు గురై మరణించాడు. శాడ్ పార్ట్ ఏంటంటే.. కొన్ని రోజులు క్రితమే అతడి మేనల్లుడు పాము కాటు వేయడంతో చనిపోయాడు. తమ కుటుంబంలోని వ్యక్తులను పాములు పగ బట్టాయని వారు బలంగా నమ్ముతున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి..  ఆ ప్రాంతంలో పాముల సంచారానికి బ్రేక్ వేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..