Tomato Fever: టమోటా ఫీవర్, కోవిడ్-19 అంత ప్రమాదకరమా..? ఇలా చేస్తే సురక్షితంగా ఉండొచ్చు..

లు రకాల వైరస్‌లు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. వాటిలో టమోటా ఫీవర్ ఒకటి. ఈ కేసులు కేరళ రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్నాయి.

Tomato Fever: టమోటా ఫీవర్, కోవిడ్-19 అంత ప్రమాదకరమా..? ఇలా చేస్తే సురక్షితంగా ఉండొచ్చు..
Tomato Fever
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 25, 2022 | 3:39 PM

Tomato Fever in India: ప్రపంచాన్ని కోవిడ్ -19 మహమ్మారి పట్టిపీడిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే మంకీపాక్స్ వైరస్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతోపాటు పలు రకాల వైరస్‌లు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. వాటిలో టమోటా ఫీవర్ ఒకటి. ఈ కేసులు కేరళ రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కూడా ఈ కేసుల లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు కేరళలో 80 కి పైగా టామోటో వైరల్ ఫీవర్ వ్యాధి కేసులు వెలుగులోకి వచ్చాయి. టమోటా జ్వరం కేసుల సంఖ్య 100 కేసులు దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. సంక్రమణను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పాటిస్తే మేలని పేర్కొంటున్నారు.

టమోటా జ్వరం కోవిడ్-19 అంత ప్రమాదకరమా?

టొమాటో ఫీవర్ లేదా టొమాటో ఫ్లూ కేసులు ఎక్కువగా పిల్లల్లోనే నమోదవుతున్నాయి. ఈ వైరల్ వ్యాధి సోకిన వ్యక్తి చర్మంపై దద్దుర్లు, నిర్జలీకరణం, చర్మంపై అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇతర ఫ్లూ మాదిరిగానే టమోటా జ్వరం కూడా అంటువ్యాధి.

ఇవి కూడా చదవండి

కోవిడ్-19 మాదిరిగానే, టొమాటో జ్వరం సోకిన వ్యక్తిని ఒంటరిగా ఉంచాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. టొమాటో ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో విశ్రాంతి, సరైన పరిశుభ్రత అవసరం.

టొమాటో ఫీవర్ గురించి కొంత ఉపశమనం కలిగించే విషయం ఎందుకంటే ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. కరోనావైరస్ వలె కాకుండా, టొమాటో ఫ్లూ అంత ప్రాణాంతక వ్యాధి కాదు. అనుభవించిన చాలా లక్షణాలు తేలికపాటివి, వైరల్ వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి.

టమోటా జ్వరం నుంచి పిల్లలను ఎలా సురక్షితంగా ఉంచాలి

పిల్లల్లో టొమాటో జ్వరం ఏవైనా లక్షణాలు కనిపిస్తే మొట్టమొదటిగా.. వెంటనే వైద్య సంరక్షణను కోరడం మంచిది. టొమాటో జ్వరం నుంచి పిల్లలను సురక్షితంగా ఉంచడానికి మీరు అనుసరించగల కొన్ని నివారణ చర్యలు ఇక్కడ ఉన్నాయి.. అవేంటో తెలుసుకోండి..

  • చర్మంపై బొబ్బలు లేదా దద్దుర్లపై రుద్దడం మానుకోండి
  • ఇంట్లో సరైన పరిశుభ్రత ఉండేలా చేసుకోండి.
  • పిల్లవాడు తరచుగా స్నానాలు చేస్తున్నాడని నిర్ధారించుకోండి. చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది.
  • టొమాటో జ్వరం సోకిన లేదా లక్షణాలు కనిపించే వ్యక్తి నుంచి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి
  • టొమాటో ఫీవర్ ప్రాణాంతకం కానప్పటికీ ఇది జ్వరం, ఇతర ఫ్లూ-వంటి లక్షణాలను కలిగిస్తుంది.
  • ఇంకా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది.
  • ఎవరికైనా వైరస్ సోకితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి