AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Habits: ఈ అలవాట్లతో వేగంగా వృద్ధాప్యం.. వదిలించుకోకపోతే ఇక అంతే సంగతులు

Bad Habits: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చెడు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా చాలా చిన్న వయుసులోనే వృద్ధాప్య సమస్యలను తెచ్చిపెడతాయి...

Bad Habits: ఈ అలవాట్లతో వేగంగా వృద్ధాప్యం.. వదిలించుకోకపోతే ఇక అంతే సంగతులు
Bad Habits
Follow us
Basha Shek

|

Updated on: Jul 25, 2022 | 4:26 PM

Bad Habits: అనారోగ్యకరమైన జీవనశైలి మనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. బిజీ షెడ్యూల్ వల్ల ఈరోజుల్లో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. ఇది అనేక రకాల మానసిక, శారీరక సమస్యలకు దారి తీస్తోంది. పని హడావిడిలో పడి తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇక ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకోవడానికంటూ చాలామంది ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసలవుతారు. ఇవి ఒత్తిడి, ఆందోళనలను అసలు ఏ మాత్రం తగ్గించవు. పైగా పలు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చెడు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా చాలా చిన్న వయుసులోనే వృద్ధాప్య సమస్యలను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా కొన్ని చెడు అలవాట్లు చర్మం, జుట్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయట. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

మద్యపానం, ధూమపానం

రెగ్యులర్‌గా మద్యం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా మన శరీర భాగాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖం మెరుపును కోల్పోతుంది.  ఇక పొగతాగేవారి ముఖంపై త్వరగా ముడతలు ఏర్పడుతాయి. వాస్తవానికి ధూమపానం సమయంలో విడుదలయ్యే పొగ ఫ్రీ రాడికల్స్‌కు కారణమవుతుంది. దీని కారణంగా కొల్లాజెన్ స్థాయులు తగ్గిపోతాయి. ఇది చర్మం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

నిద్ర లేకపోవడం

ఈ రోజుల్లో సరైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా, చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇది క్రమంగా మన పని ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. చిన్న చిన్న విషయాలకే నీరసపడిపోతారు. ఏకాగ్రత ఉండదు. ఇవి క్రమంగా వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

ఆహారం..

పోషకాహార లేమి, చెడు ఆహారపు అలవాట్లతో పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ కారణంగా వేగంగా బరువు పెరుగడం, జీవక్రియ రేటు తగ్గడం, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం, బీపీ తదితర సమస్యలు వేధిస్తాయి. జుట్టు, చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి.

వ్యాయామం చేయకపోవడం..

వ్యాయామం లేకపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనిషి నిస్తేజంగా మారిపోతాడు. చిన్న చిన్న పనులకు కూడా అలసటపడిపోతారు. ఇవన్నీ వృద్ధాప్య సమస్యలకు ఆరంభ సూచకాలే.

ఒత్తిడి

ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల కూడా పలు శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళనలతో జీవక్రియ మందగిస్తుంది. బరువు పెరగడం, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు బాధిస్తాయి. ఎక్కువ ఒత్తిడి మనల్ని వృద్ధాప్యం వైపు వేగంగా నెట్టివేస్తుంది.

కెఫిన్

టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల మనం ఎనర్జిటిక్‌గా అండ్‌ ఫ్రెష్‌గా ఉండవచ్చు. అయితే పరిమితంగానే వీటిని తీసుకోవాలి. మోతాదుకు మించి టీ, కాఫీలను తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. వీటిలోని కెఫిన్‌ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)