Lifestyle Habits: ఈ అలవాట్లు ఉంటే వేగంగా వృద్ధులవుతారు..! లైట్ తీసుకుంటే అంతే సంగతులు..
జీవనశైలి కారణంగా వృద్ధాప్యం త్వరగా ముంచుకొచ్చే ప్రమాదం ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. మనం తినే ఆహారమే కాదు అలవాట్లు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయట. బిజీ జీవన విధానం వల్ల ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ వహించడంలేదనేది కాదనలేని నిజం. ఫలితంగా..
Common Lifestyle Habits That Can Make You Age Faster: జీవనశైలి కారణంగా వృద్ధాప్యం త్వరగా ముంచుకొచ్చే ప్రమాదం ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. మనం తినే ఆహారమే కాదు అలవాట్లు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయట. బిజీ జీవన విధానం వల్ల ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ వహించడంలేదనేది కాదనలేని నిజం. ఫలితంగా అనేక రకాల మానసిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. రోజంతా పని ఒత్తిడిని అనుభవించడం వల్ల, సొంత ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం ప్రస్తుతం అందరి జీవితాల్లోనూ సర్వసాధారణమైపోయింది. తీరిక సమయాల్లో డ్రాయింగ్, గార్డెనింగ్, రీడింగ్ వంచి నచ్చిన పనులు కూడా అడుగున పడిపోతున్నాయి. వీటన్నింటినీ రోజు వారీ జీవన విధానం నుంచి పక్కకు తోసెయ్యడం మూలంగా ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత రావల్సిన వృద్ధాప్యం నలబై యేళ్లకే ముంచుకొస్తుంది. దీనివల్ల వయసు వేగంగా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కింది అలవాట్లకు దూరంగా ఉంటే త్వరగా వృద్ధాప్యం దరి చేరకుండా ఆపుచేయవచ్చు. అవేంటంటే..
మద్యపానం సేవించడం రెగ్యులర్‌గా మద్యం సేవించే అలవాటు ఆరోగ్యానికే కాదు ఆయుష్షు కూడా ప్రమాదమే. ప్రతి రోజూ ఆల్కహాల్ తాగడం వల్ల వల్ల వృద్ధాప్యాన్ని వేగవంతం చేయవచ్చని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. ఆరోగ్యాన్ని, శరీర భాగాల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా చర్మం వయస్సు కూడా వేగంగా పెరిగి పటుత్వం కోల్పోయి, వేలాడుతుంది.
సరిగా నిద్రపోకపోవడం గజిబిజీ షెడ్యుళ్ల వల్ల జీవనశైలి తలకిందులు కావడం మాత్రమేకాకుండా అలసట, నిద్రలేమీ ఇబ్బందులతో సతమతమవ్వవలసి వస్తుంది. సరైన పోషకాహరం తీసుకోకపోవడం వల్ల చాలా మందికి రాత్రిళ్లు నిద్రపట్టక, ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఇది పని ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా తరచూ నిద్రలేమితో బాధపడేవారిలో కూడా వృద్ధాప్య ప్రక్రియ వేగవంతమవుతుంది.
పోషకాహార లోపం రోజూ తినవల్సిన ఆహారంలో తగిన విటమిన్లు, మినరల్స్ కొరవడితే.. వేగంగా బరువు పెరగడం, మెటబాలిజం తగ్గుదల, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు దాడి చేస్తాయి. ఇటువంటి వారిలో మధుమేహం వ్యాధి సులువుగా వస్తుంది. ఈవిధమైన ఆహార అలవాట్లు వేగంగా వృద్ధాప్యానికి కారణమవుతాయి.
శారీరక వ్యాయామం కొరవడడం సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల కూడా అనేక వ్యాధులు చుట్టుముడతాయి. దీని ప్రభావం వల్ల వేగంగా వృద్ధాప్యం దాపురిస్తుంది.
ఒత్తిడి స్ట్రెస్ ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అనేక మానసిక లేదా శారీరక వ్యాధులకు ప్రధాన కారణం స్ట్రెస్. దీని కారణంగా జీవక్రియ మందగిస్తుంది. బరువు పెరగడం, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ ఒత్తిడి వృద్ధాప్యం వైపు వేగంగా నెట్టివేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
కెఫిన్ టీ/కాఫీలలో కెఫిన్ అధికంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. వీటిని తాగితే సెకన్లలోనే ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా మారుస్తుంది. ఐతే టీ/కాఫీలు రోజుకు మోతాదుకు మించి సేవిస్తే మానసిక, శారీరక ఆరోగ్యానికి తీవ్ర హాని తలపెడుతాయనేది నిపుణుల మాట.