DMHO Hyderabad Jobs 2022: హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. నెల జీతం రూ.60 వేలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Hyderabad District) భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన ఫిజీషియన్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి..
DMHO Hyderabad Physician Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Hyderabad District) భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన ఫిజీషియన్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 7
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్, ఫిజీషియన్ పోస్టులు
వయోపరిమితి: జూన్ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: పోస్టునుబట్టి నెలకు రూ.52,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: DMHO Hyderabad, Hyderabad, Meeting Hall, 4th floor, GHMC Building, Patny, Secunderabad, Telangana.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 27, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.