crime news: మూడు ముళ్లు వేసినవాడే కాలయముడై హతమార్చాడు.. ఇంతలో ఊహించని ట్విస్టు..
మూడు ముళ్ల బంధాన్ని అబాసుపాలు చేశాడో దుర్మార్గుడు! కట్టుకున్న భార్యను కళ్లలో పెట్టుకుని చూసుకోవడానికి బదులు.. హతమార్చి మూడో కంటికి తెలియకుండా మాయం చేయాలనుకున్నాడు. కానీ అంతలోనే అతని పాపం పండిపోయింది. వివరాల్లోకెళ్తే..
Uttarakhand Murder Case: మూడు ముళ్ల బంధాన్ని అబాసుపాలు చేశాడో దుర్మార్గుడు! కట్టుకున్న భార్యను కళ్లలో పెట్టుకుని చూసుకోవడానికి బదులు.. హతమార్చి మూడో కంటికి తెలియకుండా మాయం చేయాలనుకున్నాడు. కానీ అంతలోనే అతని పాపం పండిపోయింది. వివరాల్లోకెళ్తే..ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాకు చెందిన చైజర్ గ్రామానికి ఆనందీ దేవి (22)ని, విన్ గ్రామంలో వెల్డర్‌గా పనిచేస్తున్న కిషన్ కుమార్‌లకు పెద్దలు ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఐతే కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తుతుండటంతో భార్య ఆనందీ దేవి పుట్టింకి వెళ్లింది. దాదాపు మూడు నెల్ల తర్వాత కిషన్ కుమార్ బుధవారం (జులై 20) తన అత్తింటికి వెళ్లి భార్యను బలవంతంగా తనతోపాటు తీసుకెళ్లాడు. ఇంటికి చేరుకున్న దంపతులు పరస్పరం వాదులాడుకోవడంతో భర్త కిషన్ కుమార్ భార్య కడుపుపై బలంగా తన్నాడు. దీంతో ఆనందీ దేవి అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. భార్య చనిపోయిందని తెలుసుకున్న కిషన్ మృతదేహాన్ని మాయం చేసేందుకుగానూ నిప్పంటించాడు. ఐతే మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాలకు కిషన్ మావమరిది ఫోన్ చేసి సాయంత్రంలోగా ఆనందిని పుట్టింటికి పంపాలని చెప్పగా, సాయంత్రమైన ఆనంది పుట్టింటికి చేరలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆనంది తల్లి సునీతా దేవీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ సంఘటన చోటుచేసుకున్న ఒక రోజు తర్వాత మృతురాలి తల్లి సునీతాదేవి ఫిర్యాదు మేరకు నిందితుడు కిషన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తమదైన పద్ధతిలో పోలీసులు విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. సగం కాలిపోయి, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృత దేహాన్ని పోలీసులు గురువారం (జులై 21) స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 302, 304బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ లోకేశ్వర్ సింగ్ మీడియాకు తెలిపాడు.