Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఛాతిపై రోలు పెట్టి, అందులో పసుపుకొమ్ములు దంచే సాంప్రదాయం.. చూస్తే కంగుతింటారు

మన దేశంలో ఎన్నో మతాలు, జాతుల వారు ఉన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సాంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల కొన్ని ట్రెడిషన్స్ భయం కలిగిస్తాయి కూడా.

Viral: ఛాతిపై రోలు పెట్టి, అందులో పసుపుకొమ్ములు దంచే సాంప్రదాయం.. చూస్తే కంగుతింటారు
Different Cultural Tradition
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 24, 2022 | 1:11 PM

Tamil Nadu: తమిళనాడులో అత్యంత పవిత్రంగా భావించే మురుగన్‌కి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటోన్న వైనం సర్వత్రా హలచల్‌ చేస్తోంది. కోరికలు తీరితే కోటి మొక్కులు చెల్లించుకునే వీర భక్తులు తమిళ ప్రజలు. అలాంటిది శ్రీబాలమురుగన్‌ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే ఈ పూజల్లో భక్తుల ఒంటి మీద పసుపు దంచే ఘట్టం ఇప్పుడు సర్వత్రా హల్‌చల్‌ చేస్తోంది. మామూలుగానే పసుపు దంచాలంటే కొన్ని గంటలు పడుతుంది. అలాంటిది మనుషుల ఒంటిపై రోలు ఉంచి పసుపు దంచడం సాధ్యమేనా? ఎస్‌ సాధ్యమే అంటున్నారు తమిళనాడు భక్తులు. తమిళనాడు-ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సరిహద్దు కృష్ణగిరి సమీపంలోని జగదేవి బాలమురుగన్ ఆలయంలో ఆడి కృతికై పండుగ సందర్భంగా భక్తుల ఛాతిపై రోలు పెట్టి, అందులో పసుపుకొమ్ములు వేసి, రోకలితో పసుపు కొమ్మలను దంచి ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. క్రిష్ణగిరి సమీపంలోని జగదేవి గ్రామం లో కొలువై ఉన్న శ్రీ బాలమురుగన్ ఆలయంలో 77వ ఆడి కృత్తిక ఉత్సవాల సందర్భంగా ఈనెల 21న ధ్వజారోహణంతో మురుగన్‌ ఉత్సవాలు ప్రారంభించారు. ఇందులో భక్తులు వివిధ రకాలుగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం భక్తుల ఛాతీపై రోకలితో పసుపు దంచే కార్యక్రమం.

ఇదేదో ఎక్కడో రహస్యంగా జరిగేది కాదు. తూ తూ మంత్రంగా గోప్యంగా జరిపించేదీ కాదు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ప్రజలంతా చూస్తుండగా… ఊరేగింపుగా వెళ్తూ, భక్తుల గుండెలపై రోలు పెట్టి పసుపు దంచే కార్యక్రమంగా బహిరంగంగా జరుగుతుంది. ఈ వేడుకలో భక్తులను పారాన్ అనే మంచంపై పడుకోబెట్టి ఛాతీపై రొకళ్ళతో పసుపును దంచిన తరువాత పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఆ తరువాత భక్తుల వెన్నుకు కొక్కేలను తగిలించి 40 అడుగుల ఎత్తులో వేలాడదీసి, శ్రీ బాల కుమారునికి పూలమాల వేసి కర్పూర హారతి ఇవ్వడం ఈ పూజాకార్యక్రమంలో చివరి అంకం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..