REET 2022 Exam Row: ‘నీట్’ తరహాలోనే మరో వివాదం! పరీక్షకు హాజరైన అమ్మాయిల చీర పిన్నులు, చున్నీలు, డ్రెస్ బటన్లు తొలగించిన సిబ్బంది..
నీట్ 2022 (NEET 2022) పరీక్షకు హాజరైన యువతుల లోదుస్తులను విప్పించి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించిన ఘటన దేశ వ్యాప్తంగా పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సంబంధమున్న పలువురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు కూడా. ఇది మరువక ముందే తాజాగా మరొక అమానుష సంఘటన..
Rajasthan REET 2022 Exam Controversy: నీట్ 2022 (NEET 2022) పరీక్షకు హాజరైన యువతుల లోదుస్తులను విప్పించి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించిన ఘటన దేశ వ్యాప్తంగా పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సంబంధమున్న పలువురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు కూడా. ఇది మరువక ముందే తాజాగా మరొక అమానుష సంఘటన చోటుచేసుకుంది. నిన్న (శనివారం) రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్ (REET) 2022కి హాజరైన అభ్యర్థుల్లో.. మహిళా అభ్యర్ధులను డ్రస్‌పై వేసుకున్న దుపట్టాలు లేదా చున్నీలను తీసివేయవల్సిందిగా సిబ్బంది కోరింది. తనిఖీల పేరుతో పరీక్ష నిర్వహణ సిబ్బంది ఈ మేరకు హుకం జారీ చేసింది. వివరాల్లోకెళ్తే..
జులై 23 (శనివారం)న రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్ (REET 2022) పరీక్ష రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అనేక మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఐతే మహిళా అభ్యర్ధులను తనిఖీల పేరుతో వారు ధరించిన డ్రస్‌లపై దుపట్టాలు తొలగించడం, స్లీవ్‌లను కత్తిరించడం, డ్రస్ బటన్లు కత్తిరించడం, చీర పిన్‌లను తొలగించడం, గాయాలతో ఉన్నవారి కట్లు తొలగించాలని..ఇలా కఠిన నిబంధనల పేరుతో అభ్యర్ధులను నానా అగచాట్లు పెట్టారు.REET 2022 పరీక్ష మొత్తం32 పరీక్షా కేంద్రాల్లో జరిగింది. అభ్యర్ధులు పరీక్షా కేంద్రం వెలుపల ఉంచిన జాబితాలో వారి రోల్ నంబర్లతో పాటు తనిఖీ చేసే గదుల నంబర్లను కూడా పొందుపరిచారు. ఈ మేరకు పురుష, మహిళా అభ్యర్ధులను వేర్వేరు వరుసల్లో క్యూలు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ అధికారులు దుస్తులతోపాటు, మంగళసూత్రాలు, బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్‌లు, చెప్పులు, షూస్ తదితరాలను తొలగించాలని కోరారు. రీట పరీక్ష జూలై 23, 24, 2022 తేదీల్లో 2 సెషన్లలో జరిగేలా టైం టేబుల్ ఏర్పాటు చేశారు. REET లెవల్-1 పరీక్ష ఉదయం, REET లెవల్-2 పరీక్ష మధ్యాహ్నం జరుగుతుంది. శనివారం జరిగిన పరీక్షకు మొదటి షిఫ్ట్‌లో మొత్తం 11160 మంది, మధ్యాహ్నం షిఫ్టులో 9216 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసేందుకు వెళ్తే తమ దుస్తులు తొలగించి అవమానపరిచారని పలువురు ఈ సంఘటనపై ఫిర్యాదులు చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.