Delhi University Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) పీజీడీవీ ఈవినింగ్ కాలేజీ.. శాశ్వత ప్రాతిపదికన నాన్ టీచింగ్ (Non Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..
Delhi University Non Teaching Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) పీజీడీవీ ఈవినింగ్ కాలేజీ.. శాశ్వత ప్రాతిపదికన నాన్ టీచింగ్ (Non Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హత సాధించినవారికి నెలకు రూ.లక్షన్నరకు పైగా జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగావకాశం వరిస్తుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: నాన్ టీచింగ్ పోస్టులు
ఖాళీల వివరాలు:
- లైబ్రరీ అటెండెంట్ పోస్టులు: 4
- అసిస్టెంట్ పోస్టులు: 3
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 3
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు: 1
- లైబ్రేరియన్ పోస్టులు: 1
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు: 1
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్) పోస్టులు: 1
- సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ (లైబ్రరీ) పోస్టులు: 1
- లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు: 1
- కంప్యూటర్ లేబొరేటరీ అటెండెంట్ పోస్టులు: 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్:నెలకు రూ.19,900ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/ పీజీ, ఎల్‌ఎల్‌బీ/ఎమ్‌బీఏ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంఫిల్/పీహెచ్‌డీ, బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.500
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.