HAL Recruitment: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు.. ఐటీఐ పాసైతే చాలు..
HAL Recruitment 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ సంస్థ మహారాష్ట్ర నాసిక్‌లోని సంస్థలో 2022-23 సంవత్సరానికి...
HAL Recruitment 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ సంస్థ మహారాష్ట్ర నాసిక్‌లోని సంస్థలో 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా 455 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి.
* ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, మెషినిస్ట్ (గ్రైండర్), ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్ (జనరల్), షీట్ మెటల్ వర్కర్, మెకానిక్ (మోటార్ వెహికల్), కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 10-08-2022ని నిర్ణయించారు.
* ధ్రువపత్రాల పరిశీలనను 16-08-2022 నుంచి 31-08-2022 వరకు నిర్వహించనున్నారు.
* ఎంపికైన అభ్యర్థుల వివరాలను సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..