BSNL Recruitment 2022: బీఎస్‌ఎన్‌ఎల్‌లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగియనున్న..
మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)లో 55 అప్రెంటిస్ పోస్టుల (Apprentice Posts) భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆఖరు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు..
BSNL Apprentice Recruitment 2022: మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)లో 55 అప్రెంటిస్ పోస్టుల (Apprentice Posts) భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆఖరు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు గడువు సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 25 ఏళ్లకు మించరాదు. ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్www.mhrdnats.gov.in లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.8000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సందేహాల కోసం agmhrmp@gmail.comకు మెయిల్ పంపవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.