AIIMS Recruitment 2022: ఎయిమ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ అర్హతలుంటే జాబ్ గ్యారెంటీ..
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోనున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Raebareli).. సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన..
AIIMS Raebareli Senior Resident Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోనున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Raebareli).. సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, మెడిసిన్, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ/ఎమ్‌డీ/ఎమ్ఎస్/డీఎన్బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్రస్: Senior Administrative Officer, Recruitment Cell, 2nd Floor, Medical College Block, AIIMS Raebareli, Munshiganj, Dalmau Road, Raebareli- 229405.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.1000
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు: రూ.800
- పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16, 2022.
రాత పరీక్ష తేదీ: ఆగస్టు 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.