RCFL Recruitment 2022: బీటెక్/బీఈ నిరుద్యోగులకు సదావకాశం! రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో జాబ్ ఆఫర్స్.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL).. మేనేజ్‌మెంట్ ట్రైనీ (Management Trainee Posts) పోస్టుల భర్తీకి..
RCFL Management Trainee Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL).. మేనేజ్‌మెంట్ ట్రైనీ (Management Trainee Posts) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
విభాగాలు: కెమికల్, మెకానికల్, బాయిలర్, సేఫ్టీ, ఫైర్, సీసీ ల్యాబ్, ఐటీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
పే స్కేల్: నెలకు రూ.18,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: మార్చి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 27 ఏళ్లకు మించరాదు. రిజర్వేషన్ వర్తిస్తుంది.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత స్పెషలేజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ.1000
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూఎస్/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 18, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.