Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో గ్రూప్‌సీ పోస్టులు.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం..
Indian Navy Recruitment: ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ సివిలియన్ పర్సనల్ పోస్టులను భర్తీ చేయనుంది...
Indian Navy Recruitment: ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ సివిలియన్ పర్సనల్ పోస్టులను భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 220 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభౄగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 220 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఫైర్ ఇంజిన్ డ్రైవర్ (36), ఫైర్‌మెన్ (184) ఖాళీలు ఉన్నాయి.
* ఈస్టర్న్ నావల్ కమాండ్, వెస్టర్న్ నావల్ కమాండ్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్, సదరన్ నావల్ కమాండ్ కమాండ్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకునే వారు పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి. వీటితో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్టి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ఈస్టర్న్ నావల్ కమాండ్ ప్రధానకార్యాలయం, నావల్ బేస్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్-530014 అడ్రస్‌కు పంపించాలి.
* ఎంపికైన ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌లకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100, ఫైర్‌మెన్ పోస్టులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63200 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..