Tamil Nadu: షాకింగ్.. విషాదం నింపిన కబడ్డీ.. ఆడుతుండగానే క్రీడాకారుడు మృతి..
సరదా కోసం ఆడిన ఆట తీవ్ర విషాదం నింపింది. కబడ్డీ ఓ క్రీడాకారుడ్ని పొట్టన పెట్టుకుంది. ఆడుతూనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తమిళనాడులోని (Tamil Nadu) కడలూరులో జరిగింది. కడలూరులో జరిగిన కబడ్డీ (Kabaddi) మ్యాచ్‌లో క్రీడాకారుడు...
సరదా కోసం ఆడిన ఆట తీవ్ర విషాదం నింపింది. కబడ్డీ ఓ క్రీడాకారుడ్ని పొట్టన పెట్టుకుంది. ఆడుతూనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తమిళనాడులోని (Tamil Nadu) కడలూరులో జరిగింది. కడలూరులో జరిగిన కబడ్డీ (Kabaddi) మ్యాచ్‌లో క్రీడాకారుడు స్పృహతప్పి, కింద పడి మృతి చెందడం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. తమిళనాడులోని కడలూరు జిల్లా కడంపులియార్ పన్రుటి సమీపంలోని పెరియపురంగణి మురుగన్ టెంపుల్ వీధికి చెందిన విమల్‌రాజ్.. కబడ్డీ టీమ్ ప్లేయర్. అతను సేలం ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సేలంలోని ఓ కబడ్డీ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి పన్రుటి పక్కన మనడికుప్పంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత అనూహ్యంగా కింద పడిపోయాడు. ప్రత్యర్థి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఛాతీపై బలంగా దెబ్బ తగిలి, అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
వెంటనే అప్రమత్తమైన తోటి క్రీడాకారులు విమల్‌రాజ్‌ను చికిత్స కోసం పన్రుటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు విమల్‌రాజ్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ముత్తండికుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విమల్‌రాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ముండియంబాక్కం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.