Viral Video: చుట్టూ వందల మొసళ్లు.. పడవలో ఏ మాత్రం భయపడకుండా.. వణుకుపుట్టించే సీన్స్
ఈ సృష్టిలో వేలాది జంతువులు ఉన్నాయి. వాటిలో ప్రమాదకరమైనవి, ప్రాణాలు తీయగలిగేవి కూడా ఉన్నాయి. సింహం, పులి, చిరుత, మొసలి ఇలా ఎన్నో జీవులు మానవులకు ప్రమాదకరం. భూమ్మీద జీవించే జంతువులే కాకుండా నీటిలో నివసించే మొసళ్లు,...
ఈ సృష్టిలో వేలాది జంతువులు ఉన్నాయి. వాటిలో ప్రమాదకరమైనవి, ప్రాణాలు తీయగలిగేవి కూడా ఉన్నాయి. సింహం, పులి, చిరుత, మొసలి ఇలా ఎన్నో జీవులు మానవులకు ప్రమాదకరం. భూమ్మీద జీవించే జంతువులే కాకుండా నీటిలో నివసించే మొసళ్లు, తిమింగలాలు, వేల్స్ కూడా ఎంతో క్రూరమైనవి. వీటిలో ప్రమాదకర జీవుల జాబితాలో మొసలి అగ్రస్థానంలో ఉంటుంది. ఇవి సింహాల కంటే చాలా ప్రమాదకరం. అందుకే వాటి ముందు కూడా వెళ్లేందుకు సాహసించం. కానీ ఓ వ్యక్తి మాత్రం వందల మొసళ్ల మధ్య నుంచి అలవోకగా పడవపై ప్రయాణం చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతం నుంచి వెళ్తున్న పడవ, మరికొంత ముందుకు వెళ్లగానే మొసళ్ల గుంపుకు చేరుకుంటుంది. అక్కడ చాలా మొసళ్లు ఉన్నాయి. అవి తమ వైపు వస్తున్న పడవను చూసి దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. నీటిలో అటూఇటూ తిరుగుతూ భయం కలిగిస్తాయి. కానీ పడవలో ఉన్న వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా అలాగే వాటి ముందు నుంచి వెళ్లిపోతాడు.
#BREAKING Gator Soup!
— Breaking HaHa! (@BreakingHaHa) July 22, 2022
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 5 లక్షల 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. మనిషిపై దాడి చేయని ఆ మొసళ్లు ఏం తింటాయో కనుక్కోవాలని పలువురు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.