AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తగ్గేదే..లేదన్న మహిళ.. తలొగ్గిన SBI.. లోన్ ఎంత మాఫీ చేసిందో తెలిస్తే షాకే!

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తలొగ్గింది. ఓ మహిళ చేసిన న్యాయపోరాటంలో దేశంలోని అతి పెద్ద బ్యాంక్‌కు భారీ షాక్ తగిలింది.

Viral: తగ్గేదే..లేదన్న మహిళ.. తలొగ్గిన SBI.. లోన్ ఎంత మాఫీ చేసిందో తెలిస్తే షాకే!
State Bank Of India
Ravi Kiran
|

Updated on: Jul 25, 2022 | 1:59 PM

Share

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తలొగ్గింది. ఓ మహిళ చేసిన న్యాయపోరాటంతో దేశంలోని అతి పెద్ద బ్యాంక్‌కు భారీ షాక్ తగిలింది. సుమారు రూ. 54 లక్షల రుణాన్ని మాఫీ చేయాలని వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఆ కథేంటి.? అసలేం జరిగింది.?

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన రూపేష్ స్థానిక ఎస్‌బీఐ(SBI) బ్రాంచ్ నుంచి సుమారు రూ. 54 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. సకాలంలో EMIలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే అనూహ్యంగా అతడు కరోనా కారణంగా 2021లో మృతి చెందాడు. అంతే! తీసుకున్న లోన్ చెల్లించాలంటూ భార్య ధరణిని బ్యాంక్ అధికారులు అడిగారు. ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది. చెల్లించే ఆర్ధిక స్తోమత లేదు. న్యాయపోరాటానికి దిగింది. వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది.

తన భర్త మరణానంతరం ఇంటి పోషణ, పిల్లల పాలన, తల్లిందండ్రుల సంరక్షణ అన్ని తనపై పడ్డాయని ధరణి కోర్టుకు విన్నవించింది. తాము ఆర్ధికంగా చితికిపోయామని, చాలీచాలని డబ్బులతో ఇంటిని నడుపుతున్నానని..బ్యాంక్ లోన్ అనేది తనకు తలకు మించిన భారం అని చెప్పుకొచ్చింది. భర్త ఇన్సూరెన్స్ డబ్బులపై తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని.. కాని అవి ఇవ్వడంలో బ్యాంక్ సిబ్బంది జాప్యం చూపిస్తున్నారని ఆమె తన వాదనలను కోర్టుకు వినిపించింది. ఇక ధరణి వాదనలకు కౌంటర్ దాఖలు చేసిన SBI.. ఇన్సూరెన్స్ ఫామ్‌లో రూపేష్ వివరాలు సరిగ్గా నమోదు చేయలేదని.. అతడు లిఖితపూర్వకంగా అంగీకారం తెలపలేదని.. ఒకవేళ ప్రీమియంలు కట్ అయినా.. తమకు అందలేదని ఎస్‌బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా, వాదోపవాదనలు విన్న న్యాయస్థానం.. ఎస్‌బీఐకు భారీ షాక్ ఇచ్చింది. వినియోగదారుడు కొన్ని వివరాలు మిస్ చేసినా.. ఇన్సూరెన్స్ ప్రక్రియను పూర్తి చేసే బాధ్యత పూర్తిగా బ్యాంకు సిబ్బందిపైనే ఉంది. అంతేకాదు వినియోగదారుడికి సరైన సమాచారాన్ని అందజేయకుండా పాలసీ క్యాన్సిల్ చేయడం కూడా సరికాదని స్పష్టం చేసింది. ఇలా చేయడం పూర్తిగా రూల్స్‌కు వ్యతిరేకం. వెంటనే బ్యాంక్ వినియోగదారుడు తీసుకున్న రుణాన్ని మొత్తం మాఫీ చేయాలి. అంతేకాకుండా భర్తను కోల్పోయిన అ మహిళకు నష్టపరిహారం కింద రూ. లక్ష, కోర్టు ఖర్చుల కింద రూ. 20 వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.(Source)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.