ITR Filing Deadline: సమయం లేదు మిత్రమా… ఇంకా నాలుగు రోజులే గడువు

ITR Filing Deadline: కొన్నికొన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతో ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. గడువుతో సంబంధం లేకుండా ముందస్తుగా పనులను..

ITR Filing Deadline: సమయం లేదు మిత్రమా... ఇంకా నాలుగు రోజులే గడువు
Follow us
Subhash Goud

|

Updated on: Jul 26, 2022 | 8:28 AM

ITR Filing Deadline: కొన్నికొన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతో ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. గడువుతో సంబంధం లేకుండా ముందస్తుగా పనులను పూర్తి చేసుకుంటే ఎంత మంచిది. ప్రయోజనాలతో పాటు ఇబ్బందులకు కూడా తప్పుతాయి. ఇక ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు గడువు సమీపిస్తోంది. మీరు ఇంకా ITR ఫైల్ చేయకుంటే ఆలస్యం చేయకుండా ఈ పనిని పూర్తి చేయండి. సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. భారీగా జరిమానా చెల్లించుకోవాలి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్‌ ఫైల్ చేసేందుకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం గడువును పొడిగించనుందని కొందరు పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. గడువు పొడిగించకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మొదటి కరోనా వైరస్, తరువాత కొత్తగా ప్రారంభించబడిన ఆదాయపు పన్ను పోర్టల్‌లో లోపం కారణంగా ITR ఫైలింగ్ తేదీని గత రెండేళ్లుగా పొడిగించారు. కానీ ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి పెద్దగా లేనందున గడువు పొడిగించరనే అభిప్రాయం వ్యక్తం అవుతంది.

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. జూలై 20 వరకు 2 కోట్లకు పైగా రిటర్న్‌లు దాఖలు అయ్యాయని. జూలై 31 నాటికి దాదాపు 7 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు చేయవలసి ఉంది. చివరి రోజుల్లో సుమారు 4.5 కోట్ల మంది రిటర్న్‌లు దాఖలు చేస్తే, రిటర్న్ ఫైలింగ్ పోర్టల్‌పై భారం పెరిగి సిస్టమ్ నెమ్మదిగా మారే అవకాశం ఉంటుంది. సర్వర్‌ సమస్య తలెత్తుతుంది. దీంతో రిటర్న్‌లు దాఖలుకు సమయం పట్టవచ్చు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ వరకు వేచి ఉండకూడదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ITR కోసం చివరి తేదీ ముగిసిన తర్వాత, పన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేవారు ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అతను రూ. 5,000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే అతను ఆలస్య రుసుముగా రూ. 1000 చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

సకాలంలో రిటర్నులు దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎంత త్వరగా ఫైల్ చేస్తే, అంత త్వరగా మీ ఖాతాలో రీఫండ్ క్రెడిట్ చేయబడుతుంది. ఇది కాకుండా చివరి తేదీలో రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు తరచుగా తప్పులు జరుగుతాయి. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?