Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నిర్మానుష్య ప్రాంతంలో బైక్ వెళుతుండగా ఎదురొచ్చిన దెయ్యం.. కళ్లు తెరిచే లోపే ఊహించని షాక్..

ఈ వీడియోలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఇద్దరు బైక్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలో కనిపించిన దృశ్యం భయభ్రాంతులకు గురిచేస్తోంది.

Viral Video: నిర్మానుష్య ప్రాంతంలో బైక్ వెళుతుండగా ఎదురొచ్చిన దెయ్యం.. కళ్లు తెరిచే లోపే ఊహించని షాక్..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 26, 2022 | 3:51 PM

Horror Viral Video: సోషల్ మీడియా రకరకాల వైరల్ వీడియోలకు కేంద్రంగా మారింది. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో అందరినీ షేక్ చేస్తోంది. అవును.. ఈ వీడియోలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఇద్దరు బైక్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలో కనిపించిన దృశ్యం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఒక వేళ మీరు గ్రామాల్లో నివసించే వ్యక్తులైతే.. తాతముత్తాతల నుంచి రకరకాల కథలు విని ఉంటారు. ‘‘ఓ నిర్మానుష్యమైన దారిలో వెళుతున్నానని.. అక్కడ దెయ్యం కనిపించగా షాకయ్యానని.. అయినా పట్టు వదలకుండా దృఢంగా ఎదుర్కొంటే చివరికి దెయ్యం పారిపోయింది..’’ అంటూ తాతలు కథలు చెప్పి పిల్లల్ని నిద్రపుచ్చేవాడు. అయితే ఈ ఘటనలు నిజంగా జరిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఊహించుకోండి. తప్పకుండా మీరు కూడా భయపడతారు. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో.. అలాంటి వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు బైక్‌పై చీకటి రహదారి గుండా వెళుతుండటాన్ని మీరు చూడవచ్చు. అతను అక్కడ ఒక దెయ్యాన్ని చూస్తారు. కథల్లో అమ్మమ్మ, తాతలు చెప్పే విషయాలు ఈ అబ్బాయిలిద్దరికీ గుర్తుకొచ్చింది. అబ్బాయిలు వెంటనే అక్కడి నుంచి రూటు మార్చి పరుగులు తీశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మరో దారిలో కూడా దెయ్యం ఎదురుగా వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన అబ్బాయిలిద్దరూ నివ్వెరపోయి భయపడ్డారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో చూడండి..

View this post on Instagram

అబ్బాయిలిద్దరూ దెయ్యాన్ని చూసి వణుకుతూ గట్టిగా కేకలు వేశారు. వీడియో చూస్తుంటే ఇది నిజమైన సంఘటన కాదని, ఎవరో కావాలని ప్రాంక్ చేసి ఉంటారని ఊహించవచ్చు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే లక్ష్యంతో ఈ కంటెంట్‌ను చేసినట్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ వీడియో వాస్తవికతను టీవీ9 నిర్ధారించడంలేదు. దీనిని sakhtlogg అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయగా వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.