Headache: ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పితో బాధపడుతున్నారా? కారణం అదే కావచ్చు..

తీవ్రమైన ఒత్తిడి, శరీరంలో నీటి కొరత, సరిగా నిద్రలేకపోవడం లాంటి సమస్యలతో తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమస్యతో మీరు కూడా బాధపడుతుంటే చింతించాల్సిన

Headache: ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పితో బాధపడుతున్నారా? కారణం అదే కావచ్చు..
Headache
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 29, 2022 | 5:40 AM

Reason For Headache in the Morning: ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే తరచూ చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. అయితే.. ఈ తలనొప్పిని సాధారణమైనదిగా విస్మరిస్తుంటారు. కానీ ఇది సాధారణమైనది కాదని.. అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తలనొప్పి వెనుక చాలా కారణాలు ఉండవచ్చని పేర్కొంటున్నారు. తీవ్రమైన ఒత్తిడి, శరీరంలో నీటి కొరత, సరిగా నిద్రలేకపోవడం లాంటి సమస్యలతో తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమస్యతో మీరు కూడా బాధపడుతుంటే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇది తీవ్రమైన సమస్యగా కూడా మారవచ్చు. అందుకే ఉదయం మేల్కొన్న తర్వాత తలనొప్పికి కారణం ఏమిటీ..? ఎలా ఈ సమస్యకు చెక్‌ పెట్టాలి అనే విషయాలను తెలుసుకోవాలి.

తలనొప్పి రావడానికి కారణాలుః ముఖ్యంగా శరీరంలో సరిగా రక్తం లేకపోవడం. అదే సమయంలో శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల తలనొప్పితో పాటు బలహీనత, మైకము లాంటి సమస్యలు వస్తాయి.

చక్కెర స్థాయిః మీ శరీరంలో చక్కెర అసాధారణంగా ఉంటే మార్నింగ్ సిక్‌నెస్ లక్షణాలను చూడవచ్చు. మార్నింగ్ సిక్‌నెస్ లక్షణం కూడా తలనొప్పి ఒకటి. మరోవైపు మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి, తలనొప్పిగా ఉంటే మీ చక్కెర స్థాయిని తనిఖీ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

డీహైడ్రేషన్ః రాత్రి వేళ తక్కువ నీరు తాగితే ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పి వస్తుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో నీటి కొరత. తగినంత నీరు తాగకపోవడం వల్ల ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పి సమస్య రావచ్చు.

నిద్ర రుగ్మత: నిద్రలేమి కారణంగా ఉదయం తలనొప్పి వస్తుంది. అదే సమయంలో చాలా మందిలో ఒత్తిడి కారణంగా, తలనొప్పి సమస్య వస్తుంది. రాత్రి షిఫ్టులో పనిచేసే వ్యక్తులు కూడా ఎక్కువగా తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు.

ఉదయాన్నే తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ పనులు చేయండి..

ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం తాగాలి. చల్లటి నీళ్లకు బదులు నిమ్మరసాన్ని సాధారణ నీటిలో కలిపి తాగవచ్చు. తలనొప్పి తగ్గేందుకు కాస్త విశ్రాంతి తీసుకోండి.. ఇంకా నిద్ర పోవడం, కాసేపు యోగా, ధ్యానం చేస్తే తలనొప్పి సమస్య తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..