AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom: రెగ్యులర్‌గా యాలకులు తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు..

యాలకులను స్వీట్లు, టీ, పలు రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. యాలకుల వాడకం ఆహార రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

Cardamom: రెగ్యులర్‌గా యాలకులు తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు..
Elaichi
Shaik Madar Saheb
|

Updated on: Jul 24, 2022 | 7:30 PM

Share

Cardamom Eating Benefits: వంటింట్లో ఉండే యాలకుల్లో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. యాలకులు గరం మసాలాల్లో ఉపయోగిస్తారు. దీని సువాసన ఎంతగానో ఆకర్షిస్తుంది. యాలకులను స్వీట్లు, టీ, పలు రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. యాలకుల వాడకం ఆహార రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చిన్న యాలకులు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

యాలకుల ప్రయోజనాలు

నోటి దుర్వాసన పోతుంది: యాలకులను సాధారణంగా నేచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. రోజూ నమిలి తింటే నోటి దుర్వాసన పోతుంది.

ఇవి కూడా చదవండి

మొహం నిగారింపు పెరుగుతుంది: ఫేస్ నిగారింపు కోసం అందరూ తెగ కష్టపడుతుంటారు. దీనికోసం మీరు యాలకులను ఉపయోగించవచ్చు. ముఖానికి ఏలకుల నూనెను ఉపయోగిస్తే అది మచ్చలను తొలగించి మెరిసిపోయేలా చేస్తుంది. కావాలంటే.. యాలకుల పొడి చేసి అందులో కొద్దిగా తేనె కలపాలి. ఆ తర్వాత ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. గంట తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

పెదవులు మృదువుగా మారుతాయి: యాలకులను చాలా బ్యూటీ ప్రొడక్ట్స్, లిప్ కేర్ క్రీములలో ఉపయోగిస్తారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. యాలకులను గ్రైండ్ చేసి పౌడర్ లా తయారు చేసుకోవాలని. దానిని తేనెలో మిక్స్ చేసి పెదవులపై రుద్దండి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పెదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి.

శరీరం డిటాక్సిఫై అవుతుంది: క్రమం తప్పకుండా యాలకులను తింటే.. అవి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడతాయి. శరీర నిర్విషీకరణ ప్రభావం ముఖంపై కూడా కనిపిస్తుంది. దీంతో చర్మం క్లీన్‌గా మారి ముఖంపై అద్భుతమైన గ్లో వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి